E-Paper
Advertisement

2 అడుగుల బర్రె.. ధర ఏకంగా రూ. కోటి.. ప్రపంచంలోనే అత్యంత చిన్నది ఇదేనా?

2 అడుగుల బర్రె.. ధర ఏకంగా రూ. కోటి.. ప్రపంచంలోనే అత్యంత చిన్నది ఇదేనా?
Advertisement

Pinky Buffalo: రాజస్థాన్‌లోని పుష్కర్ మేళా పేరు చెప్పగానే ఎత్తైన గుర్రాలు, అందంగా ముస్తాబు చేసిన ఒంటెలు, అతి భారీ బర్రెలే గుర్తుకు వస్తాయి. అయితే ఇందుకు భిన్నంగా ఈసారి ఓ బుల్లి బర్రె అందరి దృష్టిని ఆకర్షించింది. కేవలం 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న ఈ పింకీ బర్రెను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ స్మాల్ బర్రె ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్ చల్ చేస్తున్నారు.

మహారాష్ట్ర థానేకు చెందిన ఈ పింకీ బర్రె.. సుమారు 1100 కి.మీ ప్రయాణించి పుష్కర్ మేళాలో పాల్గొంది. మేళాలో ఈ 2 అడుగుల పింకీతో ఫొటోలు దిగేందుకు, వీడియోలు తీసుకునేందుకు స్థానికులు ఎంతగానో ఆసక్తి కనబరిచారు. పింకీ తక్కువ ఎత్తు ఉండటం వల్ల చిన్నారులు సైతం ఎంతో ధైర్యంగా దాని వద్దకు చేరుకొని ఫొటోలకు ఫోజులు ఇచ్చారు.

Advertisement

సాధారణంగా పుష్కర్ మేళాకు గుర్రాలు, ఒంటేలతో పాటు అతి భారీ బర్రెలను చూసేందుకు సందర్శకులు వస్తుంటారు. ఈసారి ఇందుకు భిన్నంగా బుల్లి బర్రెను చూసి వారంతా ముగ్దులయ్యారని నిర్వాహకులు చెబుతున్నారు. దీనికితోడు సోషల్ మీడియాలో పింకీ వీడియోలు వైరల్ కావడంతో మరింత మందికి దానిగురించి తెలిసి.. మేళాకు వచ్చారని పేర్కొంటున్నారు. ఇన్నాళ్లు మేళాకు వచ్చిన వారంతా భారీ ఆకారంలో ఉండే పశువులను చూసేందుకు ఇష్టపడేవారని.. ఈసారి సందర్శకుల అందరినీ గంపగుత్తగా పింకీ తనవైపునకు తిప్పుకుందని వివరిస్తున్నారు.

Advertisement

అయితే పింకీ ఏదో ప్రత్యేక జాతి బర్రె కాదని దాని యజమాని తెలిపారు. పింకీ తల్లి కూడా చాలా తక్కువ ఎత్తులోనే ఉండేదన్నారు. అది 3 అడుగులు ఉంటూ రోజుకు 2 లీటర్ల పాలు ఇచ్చేదని పేర్కొన్నారు. అయితే పింకీ ఇప్పటివరకూ ఏ దూడకు జన్మనివ్వలేదన్నారు. ప్రపంచంలోనే అత్యంత పొట్టి బర్రె ఇదే కావొచ్చని యజమానులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: నటనలో రజనీకాంత్ మనవడు.. టెక్నాలజీలో సీఈఓ.. ఆశ్చర్యపరుస్తున్న 13 ఏళ్ల రిత్విక్!

అయితే పింకీ ఎత్తు గురించే కాకుండా దాని విలువపై కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. పింకీ విలువ రూ.20 లక్షల నుంచి ఏకంగా రూ.1 కోటి వరకూ ఉండొచ్చని పలువురు అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రచారం స్థానికులు, సోషల్ మీడియాలో జరుగుతున్నా.. దాని అసలు విలువను మాత్రం యజమాని క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. మరోవైపు పొట్టిగా ఉండే పుంగనూరు ఆవులు, భారీ కాయంగల ముర్రా బర్రెలు, రూ.కోట్ల విలువైన మేలు జాతి గుర్రాలు ఈ మేళాలో పాల్గొని సందర్శకులను ఆకర్షించాయి.

Also Read: వందేభారత్ స్లీపర్‌లో కొత్త ఫుడ్ రూల్.. ఇకపై విమానాల్లో మాదిరిగా ఫుడ్ సర్వీస్!

Tags

Related News

ఉమర్​ ఖలీద్​, షర్జిల్​ ఇమామ్‌కు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!

రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. అలహాబాద్ హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేత!

మందు బాబులకు వైద్యుల షాక్.. వైన్ షాపుల బయటే హెల్త్ క్యాంప్!

కోర్టు వెలుపలే దారుణం.. హత్య కేసు నిందితుడిపై వేటకొడవళ్లతో దాడి.. భయానక దృశ్యాలు వైరల్!

సుప్రీం ఆదేశాలు ఉన్నా.. తిరుప్పరంకుండ్రంలో వెలగని దీపం.. కారణాలేంటో కుండబద్దలు కొట్టిన మధురై కలెక్టర్!

‘బయటకు వెళ్దాం.. నేను చెప్పిన బట్టలు వేసుకో’.. విద్యార్థినికి టీచర్ అసభ్యకర మెసేజ్‌లు!

ఢిల్లీలో మరో ఘోరం.. కేఫ్‌లో యువతిపై సామూహిక అత్యాచారం.. తోటి ఉద్యోగులే కీచకులు!

Big Stories

Advertisement
×