E-Paper
Advertisement

అంతిమ విజయం ధర్మానిదే.. బండ్ల గణేష్ సంచలన పోస్ట్!

అంతిమ విజయం ధర్మానిదే.. బండ్ల గణేష్ సంచలన పోస్ట్!
Advertisement

Bandla Ganesh:ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (Bandla Ganesh)కు సంబంధించిన రూ.95 లక్షల చెక్ బౌన్స్ కేసు కథ సుఖాంతం అవడంతో తాజాగా ఆయన పెట్టిన పోస్ట్ మరోసారి వైరల్ గా మారింది.” అంతిమ విజయం ధర్మానిదే” అంటూ బండ్ల గణేష్ పెట్టిన పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. “ధర్మం ఏ రోజు ఓడిపోదు.. న్యాయం ఆలస్యం కావచ్చు కానీ అంతిమ విజయం ధర్మానిదే” అంటూ బండ్ల గణేష్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మొత్తానికైతే ఈయనపై వచ్చిన కేసులు, ఆరోపణలు పూర్తిగా పరిష్కారం అవడంతో బండ్ల గణేష్ కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు.

అసలేం జరిగిందంటే?

అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో ప్రకాశం జిల్లా మద్దిరాల – ముప్పాళ్ళ కు చెందిన జానకిరామయ్య వద్ద బండ్ల గణేష్ రూ.95 లక్షలు తీసుకున్నారు. అయితే జానకి రామయ్య మరణం తర్వాత ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వరరావుకు బండ్ల గణేష్ తన పరమేశ్వర ఆర్ట్స్ పేరిట చెక్ ఇచ్చారు. అయితే ఖాతాలో తగినంత నగదు లేక ఆ చెక్ బౌన్స్ కావడంతో వెంకటేశ్వరరావు ఒంగోలు కోర్ట్ ను ఆశ్రయించారు. విచారించిన ఒంగోలు న్యాయస్థానం బండ్ల గణేష్ ను దోషిగా తేలుస్తూ ఏడాది పాటు జైలు శిక్ష, అలాగే రూ.95 లక్షల జరిమానా, బాధితుడి కోర్టు ఖర్చులు అన్నీ చెల్లించాలని తీర్పునిచ్చింది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. బండ్ల గణేష్ కి ఏడాది పాటు జైలు శిక్ష అని తెలియడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. ఇక ఎప్పట్లాగే కొంతమంది ట్రోలర్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు కూడా.

Advertisement

ALSO READ:సలహా ఇస్తూనే ఏడిపించేసిన వీ.జే.సన్నీ.. ప్రియాంక ప్రవర్తనపై శివ్ తో ఏమన్నారంటే?

చెక్ బౌన్స్ కేసులో వివాదం సుఖాంతం..

ఇక తర్వాత జెట్టి వెంకటేశ్వరరావు ఇటీవల ఒక వీడియో విడుదల చేస్తూ ఈ కేసు వివరాలపై కీలక విషయాలు వెల్లడించారు. ఆయన ఒక వీడియో విడుదల చేస్తూ అందులో.. “మా మధ్య ఉన్న చిన్నపాటి వివాదాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది కావాలనే అపార్ధాలు సృష్టించి, లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గతంలో నా కుమారుడు, బండ్ల గణేష్ ఎంతో స్నేహంగా ఉండేవారు. నా కుమారుడు మరణం తర్వాత ఈగో కారణంగానో లేదా మధ్యవర్తుల ప్రమేయం కారణంగానో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చి అది కాస్త కోర్టు కేసుల వరకు దారితీసాయి. ప్రస్తుతం ఇరుపక్షాల మధ్య విభేదాలు తొలగిపోయాయి. బండ్ల గణేష్ తో మా స్నేహం, అనుబంధం గతంలో లాగే కొనసాగుతుంది” అంటూ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. మొత్తానికైతే గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ చెక్ బౌన్స్ వివాదానికి తెరపడింది. మొత్తానికి అయితే బండ్ల గణేష్ ను టార్గెట్గా చేసుకొని కొంతమంది సోషల్ మీడియాలో చేసిన ట్రోల్స్, వైరల్ చేసిన తప్పుడు ప్రచారాలకు చెక్ పడింది అని చెప్పవచ్చు.

Advertisement

Related News

‘ఓమ్’ మూవీ నటీనటుల రెమ్యూనరేషన్?

గూస్ బంప్స్ తెప్పిస్తున్న వృషకర్మ ట్రైలర్.. సైన్స్ కే సవాల్ విసురుతూ!

ఆషికా రంగనాథ్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

విఎఫ్ఎక్స్ కోసం కోట్లు అవసరం లేదు.. రూ.5 వేలకే సుజల్ సినిమాటిక్ రేంజ్ బ్యాట్ మ్యాన్ వీడియోలు!

ఎన్టీఆర్ కోసం తోట వైకుంఠం అపురూపమైన కానుక.. ప్రత్యేకత ఏమిటంటే!

చూపు తిప్పుకోనివ్వని మహిమా..ఈ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తుందేంటి బాసూ!

రెండేళ్లు అవే పనులు.. మిస్ ఇండియా తర్వాత మానస వారణాసి లైఫ్‌లో అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×