E-Paper
Advertisement

మా ర్యాలీ దెబ్బకు బీజేపీలో భయం.. అందుకే కౌంటర్ ర్యాలీలు: మహేష్ కుమార్ గౌడ్

మా ర్యాలీ దెబ్బకు బీజేపీలో భయం.. అందుకే కౌంటర్ ర్యాలీలు: మహేష్ కుమార్ గౌడ్
Advertisement

Mahesh Kumar Goud: రాజ్యాంగ పరిరక్షణ పేరుతో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే బీజేపీ కౌంటర్ ర్యాలీలు చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎన్ని కౌంటర్ ర్యాలీలు నిర్వహించినా దేశ ప్రజలు ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటారని ఆయన స్పష్టం చేశారు.

రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం

Advertisement

ప్రధాని మోదీ పాలనలో దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యమవుతున్నాయని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గత 13 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వమే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని విమర్శించారు. సీబీఐ, ఈడీలతో పాటు చివరికి ఎన్నికల కమిషన్‌ను సైతం కేంద్ర ప్రభుత్వం తన జేబు సంస్థలుగా మార్చుకుందని అన్నారు.

ఓట్ల తొలగింపుపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

Advertisement

ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం అక్రమంగా ఓట్ల తొలగింపునకు పాల్పడుతోందని టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు. అమాయకులు, పేద ప్రజల ఓట్లను తొలగిస్తున్నారన్నది ముమ్మాటికీ వాస్తవమని చెప్పారు. ఇదే ఓట్ల తొలగింపు అంశంపై సుప్రీంకోర్టు సైతం తప్పుపట్టడంతో కేంద్రం చేస్తున్న అసలు వాస్తవాలు ప్రజల ముందు బయటపడ్డాయని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, పేదల ఓటు హక్కును కాపాడేందుకే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని తెలిపారు.

గాంధీ కుటుంబంపై వ్యాఖ్యలకు కౌంటర్

దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సరికావన్నారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన చరిత్ర నెహ్రూ, గాంధీ కుటుంబాలకు ఉందని గుర్తు చేశారు. అలాంటి త్యాగాల చరిత్ర ఉన్న కుటుంబం గురించి మాట్లాడే నైతిక హక్కు సంఘ్ పరివార్‌కు లేదన్నారు.

Also Read: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం.. ఆ మహాదాత ఎవరో తెలిసిపోయింది!

Tags

Related News

300 మందిని చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్.. కాచిగూడ స్టేషన్‌లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు!

పదవులు తీసుకుని కూర్చుంటే సరిపోదు.. పనిచేయాల్సిందే! ఫ్రంటల్ నేతలకు ఏఐసీసీ క్లాస్!

ఐవీఎఫ్ అండాల దందా వెనుక కేటీఆర్ హస్తం? బల్మూర్ వెంకట్ సంచలన వ్యాఖ్యలు!

లైక్‌లు, పబ్లిసిటీ కోసం రోడ్లపైకి రాలేదు.. దీని వెనుక అసలు లక్ష్యం ఇదే: కిషన్ రెడ్డి

కుమార్తె ప్రేమ వ్యవహారం.. ఆగ్రహాంతో రగిలిపోయిన తండ్రి, ఆదిలాబాద్ జిల్లాలో దారుణం

పౌల్ట్రీ పరిశ్రమకు గుడ్ న్యూస్.. ఫ్యూచర్ సిటీలో కీలక ప్రాజెక్టుకు సీఎం గ్రీన్ సిగ్నల్!

పల్నాడు ప్రాజెక్టుపై మౌనం ఎందుకు?.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ఫైర్

Big Stories

Advertisement
×