BigTV English
Advertisement

India Pakistan War : హైదరాబాద్‌లో పాక్ ఉగ్రవాదులు? వీడియో వైరల్

India Pakistan War : హైదరాబాద్‌లో పాక్ ఉగ్రవాదులు? వీడియో వైరల్

India Pakistan War : హైదరాబాద్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారా? ఈ డౌట్ ఎప్పటినుంచో ఉంది. అందుకు అనేక ఆధారాలు కూడా ఉన్నాయి. గతంలో భాగ్యనగరంలో బాంబు బ్లాస్టింగ్స్ గట్రా తరుచూ జరిగేవి. ఆ సమయంలో పాతబస్తీలో దాగున్న ఉగ్రవాదులు, వారి సానుభూతిపరుల పేర్లు బయటకు వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి కాస్త కంట్రోల్‌లోనే ఉంది. కానీ, హైదరాబాద్‌లో ఇప్పటికీ స్లీపింగ్ సెట్స్ ఉన్నాయనే అనుమానం బలంగా వినిపిస్తూ ఉంటుంది. పెద్దగా యాక్టివిటీ లేకున్నా.. నివురుగప్పిన నిప్పులా మన నగరంలో ఉగ్రవాదులు దాగున్నారని.. ఇప్పటికీ పాక్ ఉగ్ర ముఠాలతో టచ్‌లో ఉన్నారని అంటుంటారు. NIA పలుమార్లు పాతబస్తీలో తనిఖీలు చేసి అనుమానితులను ప్రశ్నించింది కూడా. ఇదంతా పక్కనపెడితే.. లేటెస్ట్‌గా ఇండియా, పాకిస్తాన్ యుద్ధం సమయంలో హైదరాబాద్‌కు చెందిన ఓ ఫ్యామిలీ వీడియో తెగ వైరల్ అవుతోంది. జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌తో ఇక్కడి వాళ్లకు లింకులు ఉన్నాయనే అనుమానాన్ని బలపరుస్తోంది. అందులోనూ ఓ మహిళ.. నేరుగా మసూద్‌తో కాంటాక్ట్‌లో ఉందట. గత పదేళ్లుగా అజార్‌కు ఆ మహిళ మెయిల్స్‌ పంపిస్తోందట. ఈ విషయం మరెవరో కాదు ఆమె భర్తే చెబుతున్నాడు. అందుకే ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.


ఆ వీడియోలో ఏముందంటే..

ఓ భర్త తన భార్యను మొబైల్‌లో వీడయో తీస్తున్నాడు. ఆ వీడియోలో అతను ఆమెపై అనేక ఆరోపణలు చేస్తున్నాడు. తన భార్యకు జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్‌తో సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. 2016 నుంచి అతనికి ఆమె మెయిల్స్ చేస్తోందని చెబుతున్నాడు. తన భార్య హిందువు నుంచి ముస్లింగా మారిందని.. పాకిస్తాన్‌కు గూఢాచారిగా పని చేస్తోందని ఆరోపిస్తున్నాడు. టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నాయని.. ఆమెతో భారత దేశానికి ప్రమాదం ఉందని ఆ భర్త అంటున్నాడు. తన భార్య విషయం ఇండియన్ గవర్నమెంట్‌కు చెబుతానని హెచ్చరిస్తున్నాడు.


భర్తే ఉగ్రవాదా?

అయితే, అతను అన్ని ఆరోపణలు చేస్తున్నా ఆ భార్య మాత్రం బిందాస్‌గా భర్తకు బదులు ఇస్తోంది. ఎవరు దేశ ద్రోహినో ఆ దేవుడికి తెలుసు అంటోంది. 2016లో తన మెయిల్‌ను హ్యాక్ చేసి భర్తనే.. పాక్ టెర్రరిస్ట్ మౌలానా మసూద్‌కు మెయిల్ పెట్టాడంటూ ట్విస్ట్ ఇచ్చింది. ఇండియన్ గవర్నమెంట్‌కు ఇప్పటికే ఆ మెయిల్ గురించి తెలుసు అని అంటోంది. అయితే, ఉగ్రవాదుల్లో మహిళలు ఉన్నట్టు ఇప్పటి వరకైతే చూడలేదు. ఆ లెక్కన అతను చెబుతున్నదే అబద్దం కావొచ్చు. ఆమె ఆరోపిస్తున్నట్టే అతనే పాక్ టెర్రరిస్టులకు మెయిల్స్ చేసుంటాడని.. ఆ నెపం భార్యపై మోపుతున్నాడని అనిపిస్తోంది.

హైదరాబాద్‌లో స్లీపింగ్ సెల్స్?

అలా హైదరాబాద్‌కు చెందిన ఆ ముస్లిం భార్యాభర్తలు తిట్టుకునే వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక్క రోజులోనే ఒకటిన్నర మిలియన్ల మంది చూశారు. ఆ వీడియోలో.. 2016 నుంచి పాక్‌లో ఉండే.. జైషే చీఫ్ మసూద్‌కు వాళ్లు మెయిల్ పంపినట్టు తెలుస్తోంది. అయితే, తన మెయిల్‌ను హ్యాక్ చేసి భర్తే ఆ పని చేశాడని ఆ భార్య అంటోంది. అంటే, మెయిల్ పంపిన విషయం మాత్రం వాస్తవమే అని తెలుస్తోంది. మరి, పంపింది భార్యనా? భర్తనా? అనేది క్లారిటీ లేదు. ఆ వీడియోను బట్టి చూస్తే.. హైదరాబాద్‌లో ఉగ్రవాద స్లీపింగ్ సెల్స్ ఉన్న మాట నిజమేనా? భాగ్యనగరంలో పాకిస్తాన్ సానుభూతిపరులు ఉన్నారా? ఇప్పటికీ పాక్ టెర్రరిస్టులతో టచ్‌లో ఉన్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వీడియోలో ఉన్న భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే కానీ.. అసలు నిజమేంటో బయటకు వస్తుందంటున్నారు.

Related News

Maganti Gopinath: గోపినాథ్ మరణంపై సీబీఐ విచారణ కోరుతూ గోపినాథ్ బాధితుల డిమాండ్

Jubilee Hills Elections: ముగిసిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం.. బహిరంగ సభలు, ప్రసంగాలపై నిషేధం

Jubilee Hills Elections: మూడేళ్ల అభివృద్ధికి కాంగ్రెస్‌ను గెలిపించండి.. ఓటర్లకు మంత్రుల పిలుపు

Medak District: దారుణం.. రెండు నెలల కూతురిని ట్రాక్టర్ టైర్ల కింద పడేసిన కసాయి తల్లి

Four Legged Rooster: అయ్య బాబోయ్.. ఈ కోడిపుంజుకు 4 కాళ్లు.. బరిలోకి దింపితే కత్తి ఎక్కడ కట్టాలి..

Maganti Family Dispute: బీఆర్ఎస్ మాజీ మంత్రి నన్ను బెదిరించారు.. మాగంటి కుమారుడి సంచలన వ్యాఖ్యలు!

Jagtial: జగిత్యాల జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి.. గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారని స్థానికుల ఆరోపణలు!

Cold Weather: వణుకుతున్న తెలంగాణ.. ఈ నవంబర్ ఎలా ఉండబోతుందంటే..

Big Stories

×