Visakha Agency: భార్యభర్తల మధ్య గొడవల్లోకి ఏ ఒక్కరూ ఎంటర్ కాదు. ఒకవేళ జోక్యం చేసుకున్నా ఇబ్బందులు తప్పవు. ఆ తరహా సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇద్దరు బావమరుదులు ఎంటరయ్యారు. పట్టరాని కోపంతో వారిని శూలంతో పొడిచి చంపేశాడు స్వయానా బావ. అప్పటిగానీ ఆ వ్యక్తి కోపం చల్లారలేదు. ఈ ఘటన ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీలో చోటు చేసుకుంది.
స్టోరీలోకి వెళ్తే..
అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లిలో భార్యభర్తల మధ్య గొడవ ఇద్దర్ని బలి తీసుకుంది. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గూడెం కొత్త వీధి మండలంలో చోటు చేసుకుంది. అర్థరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్దాం. గూడెం కొత్తవీధిలో మూరుమూల గ్రామంలో భార్యభర్తలు ఉంటున్నారు.
అయితే ఆ ఇల్లాలి భర్త చీటికి మాటికీ డబ్బులు తీసుకుని తాగుడికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్యభార్తల మధ్య తరచు గొడవలు జరిగేవి. ఈ విషయం ఆ మహిళ సోదరులకు తెలిసింది. వెంటనే కిముడు కృష్ణ, కిముడు రాజు కలిసి తన సోదరి ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో బావ గెన్నును అడ్డుకునే ప్రయత్నం చేశారు. పట్టరాని కోపంతో అందుబాటులో ఉన్న శూలంతో పొడిచాడు.
మద్యమే కారణమా?
అక్కడికక్కడే అతడు మృతి చెందాడు. మద్య మైకంలో ఉండడంతో మరో బావమరిదిని అదే శూలంలో పొడిచి చంపేశాడు. ఈ ఘర్షణను అడ్డుకోబోయిన మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి విశాఖపట్నం కేజీహెచ్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.
ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది స్పాట్‌లో మృతి, ఇంతకీ ఎక్కడ?
ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. ఘటనపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయంలో నిందితుడి భార్య నిజం చెబితేనే అసలు విషయాలు బయటకువస్తాయని అంటున్నారు. స్థానికుల వెర్షన మరోలా ఉంది. వీరిద్దరు గొడవ పడడం రోజూ సహజమేనని అంటున్నారు. మధ్యలోకి అనవసరంగా బావమరుదులు వచ్చారని అంటున్నారు.