BigTV English

Nagarjuna N Convention demolish: హీరో నాగార్జున‌కు షాక్.. ఎన్ కన్వెన్షన్‌ సెంటర్‌ని కూల్చేసిన హైడ్రా

Nagarjuna N Convention demolish: హీరో నాగార్జున‌కు షాక్.. ఎన్ కన్వెన్షన్‌ సెంటర్‌ని కూల్చేసిన హైడ్రా

Nagarjuna’s N Convention demolish(Hyderabad latest news): హీరో నాగార్జునకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేశారు. తమ్మిడికుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఆరోపణలు తీవ్రమయ్యాయి. గడిచిన వారంరోజులుగా హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో అధికారులు చర్యలు చేపట్టారు.


తొలుత నోటీసులు ఇచ్చారు అధికారులు. అనంతరం శనివారం ఉదయం కూల్చివేత మొదలుపెట్టారు. దాదాపు మూడున్నర ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఫిర్యాదులు జోరందుకున్నాయి. కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.

హైదరాబాద్ సిటీలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపిస్తోంది హైడ్రా. ఈ క్రమంలో చెరువులు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలపై దృష్టి సారించింది. చాలాప్రాంతాల్లో పలు భవనాలను కూల్చివేసింది హైడ్రా. మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువు సమీపంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ నిర్మించారు.


ALSO READ:  టీపీసీసీ పోస్టు.. హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్.. రేపో మాపో ప్రకటన..

చెరువుకు సంబంధించి దాదాపు మూడున్నర ఎకరాలు కబ్జా చేశారని గతంలో ఫిర్యాదులు అధికారులకు వెళ్లాయి.  సీఎం కేసీఆర్ ఉన్న సమయంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేయాలని అధికారులు భావించారు. తెల్లవారితే దాన్ని కూల్చివేయాలని బుల్డోజర్లను మొహరించారు అధికారులు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదుగానీ సైలెంట్ అయ్యింది.

తాజాగా ఎన్ కన్వెన్షన్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గతంలో మాదిరిగానే పరిస్థితులు పునరావృతమవుతాయని వార్తలు వచ్చాయి. ఇవేమీ హైడ్రా అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం పోలీసుల బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ సెంటర్‌‌ను కూల్చివేశారు.

 

 

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×