BigTV English

Vinesh Phogat Brand Value: అమాంతం పెరిగిపోయిన వినేశ్ ఫోగట్ బ్రాండ్ విలువ.. పారిస్ లో ఓడినా పాపులారిటీ పైపైకి!

Vinesh Phogat Brand Value: అమాంతం పెరిగిపోయిన వినేశ్ ఫోగట్ బ్రాండ్ విలువ.. పారిస్ లో ఓడినా పాపులారిటీ పైపైకి!

Vinesh Phogat Brand Value| పారిస్ లో ఈ సంవత్సరం జరిగిన ఒలింపిక్స్.. భారతీయులకు ఒక పీడకలగా మిగిలిపోయింది. బంగారు పతకం సాధిస్తుందనుకున్న మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగట్ పై నియమాల పేరుతో అన్యాయంగా అనర్హత వేటు వేశారనే భావన ప్రతి దేశ పౌరుడిలో ఉంది.


ఈ నేపథ్యంలో ఆ బాధను అనుభవించిన వినేశ్ ను ఇండియాలో ఒక హీరోలా చూస్తున్నారు. ఒలింపిక్స్ నుంచి ఇప్పటివరకు ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ. జరుగుతోంది. కొందరైతే ఆమె రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతోందని అంటున్నారు. అయితే దేశం మొత్తం తన పేరు మార్మోగిపోవడంతో వినేశ్ బ్రాండ్ విలువ పెరిగిపోయింది. దీంతో వినేశ్ కూడా తన ఫీజు పెంచేసింది.

పారిస్ ఒలింపిక్స్ కు ముందు వినేశ్ ఒక కంపెనీ బ్రాండ్ ని ఎండోర్స్ చేయాలంటే రూ.25 లక్షలు తీసుకునేది. అయితే ఒలింపిక్స్ తో వచ్చిన పాపులారిటీ వల్ల ఆమె ఒక కంపెనీ ప్రొడక్ట్ ని అడ్వర్‌టైజ్ చేసేందుకు రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు అడుగుతోందట.


పారిస్ ఒలింపిక్స్ మహిళల కుస్తీ పోటీల్లో వినేశ్ ఫోగట్ తొలి మ్యాచ్ లోనే ప్రపంచ చాంపియన్ అయిన జపాన్ రెజ్లర్ యుయి సుసకి ని సినీ ఫక్కీలో ఓడించి.. అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆ తరువాత క్వార్టర్ ఫైనల్లో యుక్కెయిన్ రెజ్లర్ ని, సెమీ ఫైనల్లో క్యూబా రెజ్లర్లని ఓడించి ఫైనల్స్ కు అర్హత సాధించింది. ఫైనల్స్ లో కూడా అమెరికా రెజ్లర్ ని అలవోకగా ఓడిస్తుందని అందరూ అనుకుంటున్న తరుణంలో ఒలింపిక్స్ కమిటీ ఆమెపై అనర్హత వేటు వేసింది.

ఫైనల్స్ మ్యాచ్ కు ముందు ఆమె శరీర బరువు 50 కేజీలకు కేవలం 100 గ్రాములు ఎక్కువ ఉండడంతో నిబంధనల ప్రకారం ఆమెపై అనర్షత వేటు వేసింది. సరే అంతవరకు సెమీ ఫైనల్ గెలిచింది గనుక వినేశ్ కు సిల్వర్ మెడల్ ఇస్తారా? అంటే అది కూడా లేదు. ఆమెకు ఎలాంటి మెడల్స్ ఇచ్చేది లేదని ఒలింపిక్స్ కమిటీ రూల్స్ బుక్ తెరిచి చూపించింది.

అయినా వినేశ్ ఫొగట్ తనకు జరిగిన అన్యాయం పట్ల సోర్ట్స్ కోర్టులో అప్పీల్ చేసింది. కానీ అక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. దీంతో ఆమె ఇండియా తిరిగి వచ్చేసింది. అయితే వినేశ్ ఢిల్లీ ఎయిర్ పోర్టు చేరుకోగానే ఆమె గ్రామానికి చెందిన పెద్దలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఒలింపిక్స్ పతకం లేకపోతే ఏ.. తాము బంగారు పతకం ఇస్తామని.. వినేశ్ కు సన్మానం చేసి గ్రామ పెద్దలు బంగారు పతకం బహుకరించారు.

Also Read: మూడు సూపర్ ఓవర్లు.. నరాలు తెగే ఉత్కంఠ పోరులో హుబ్లీ టైగర్స్ విజయం!

మరోవైపు వినేశ్ ఫోగట్ రాజకీయాల్లో చేరబోతోందనే చర్చలు మొదలయ్యాయి. దీనికి రెండు కారణాలున్నాయి. గత ఏడాది ఆమె మహిళా రెజ్లర్లపై లైంగిక దాడులు చేసే నాయకులకు వ్యతిరేకంగా నిరసనలు చేసింది. ముఖ్యంగా బిజేపీ ఎంపీ బ్రిజ్ భూషన్ సింగ్ కు వ్యతిరేకంగా ప్రముఖ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మలిక్ లు చేసిన నిరసనలు వివాదాస్పదంగా మారాయి. పైగా వినేశ్ తాను రెజ్లింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించింది. అయితే ఆమె తన నిర్ణయం మార్చుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: ఒలింపిక్స్ చాంపియన్లను అవమానించిన ప్రధాని.. మండిపడిన హాకీ లెజెండ్స్!

రెండో కారణం ఆమె పారిస్ నుంచి తిరిగి రాగానే ఘనస్వాగతం పలికిన వారిలో కాంగ్రెస్ నాయకుడు దీపేందర్ హూడా ఉండడం. ఇప్పటికే ఆమె రాజకీయాల్లోకి రావాలని పలు పార్టీలు ఆమెకు ఆహ్వానం పలికారని సమాచారం. కానీ వినేశ్ భర్త మాత్రం తన భార్య మరో రెండు నెలల్లో జరుగుబోయే ప్రపంచ కుస్తీ పోటీల్లో పాల్గొంటే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Also Read: తినడానికి తిండి లేదు.. తండ్రి కూలీ.. కట్ చేస్తే ఇప్పుడు ఒలింపిక్ హీరో

Related News

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

Big Stories

×