BigTV English

HCU : ఆ 2వేల మందిపై.. సర్కారును గిల్లుతున్న స్మిత?

HCU : ఆ 2వేల మందిపై.. సర్కారును గిల్లుతున్న స్మిత?

HCU : ఆమె ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. కేసీఆర్ హయాంలో హెలికాప్టర్ ఐఏఎస్‌గా గుర్తింపు ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆమె పర్యవేక్షణలోనే జరిగేవి. ఎప్పుడంటే అప్పుడు హెలికాప్టర్ వేసుకుని పర్యటనలు చేసే వారని అంటారు. సీఎంవోలో కీలక బాధ్యతలు నిర్వహించేవారు. బాస్‌కు నమ్మదగ్గ అధికారిణిగా చెలామణి అయ్యేవారు. ప్రభుత్వం మారాక స్మితా సభర్వాల్ యాక్టివ్‌గా లేరు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే.. కనీసం ఆయన్ను మర్యాదపూర్వకంగా కలవడానికి కూడా వెళ్లలేదు. స్మితా తీరుపై ఐఏఎస్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. తెలంగాణ టూరిజం శాఖను స్మితా సభర్వాల్‌కు అప్పగించి ప్రభుత్వం ఆ సీనియర్ అధికారి ప్రాధాన్యం ఏమాత్రం తగ్గించలేదు. అయినా కూడా… ఐఏఎస్ స్మిత మాత్రం సర్కారుతో టచ్‌ మీ నాట్ అన్నట్టుగానే ఉంటున్నారనే ఆరోపణ ఉంది. అది కాస్తా.. HCU వివాదంలో మరింత ముదిరింది.


ఐఏఎస్ ఆఫీసర్ అలా చేయొచ్చా?

కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది. అటవీ భూముల్లో బుల్డోజర్లు దింపారంటూ.. నెమళ్లు, జింకలు చనిపోతున్నట్టు ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఫోటోలతో ఫేక్ ప్రచారం నడిచింది. సర్కార్ ఇమేజ్‌కు బాగా డ్యామేజ్ కూడా అయింది. ఆ డ్యామేజ్‌లో ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సభర్వాల్ సైతం తనవంతు పాత్ర పోషించారని గుర్తించారు పోలీసులు. ఆ ఏఐ ఫేక్ ఇమేజ్‌ను ఆమె తన ఎక్స్ అకౌంట్లో రీట్వీట్ చేశారు. చేస్తే తప్పేముంది? అనుకోవడానికి లేదంటున్నారు. ఆమె బాధ్యతగల ప్రభుత్వ అధికారిణి. ప్రభుత్వంకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ప్రోత్సహించడమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. అందుకే వివరణ ఇవ్వాలంటూ BNSS యాక్ట్ ప్రకారం పోలీసులు స్మితకు నోటీసులు జారీ చేశారు. లేటెస్ట్‌గా ఆ నోటీసులపై ఐఏఎస్ స్మిత సభర్వాల్ కాంట్రవర్సీ కామెంట్లు చేయడం ఆసక్తికరంగా మారింది.


స్మితను టార్గెట్ చేశారా?

కేవలం తనపైనేనా? ఆ పోస్ట్ రీట్వీట్ చేసిన మరో 2వేల మందిపై కూడా చర్యలు తీసుకుంటారా? అంటూ ఎక్స్ వేదికగా మరో పోస్ట్ పెట్టారు ఐఏఎస్ స్మిత సభర్వాల్. కంచ గచ్చిబౌలి భూముల అంశంలో ఏప్రిల్ 12న తనకు జారీ చేసిన నోటీసులపై పోలీసులకు పూర్తిగా సహకరించానని చెప్పారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపారు. అయితే, చట్టం అందరికీ సమానమా? కేవలం కొందరినే సెలెక్టెడ్‌గా టార్గెట్స్‌ చేస్తున్నారా? అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. స్మిత ట్వీట్‌పై మళ్లీ కలకలం చెలరేగుతోంది.

Also Read : రూ. 2 వేల కోట్లు.. ఏపీ ఎమ్మెల్యే భూములపై హైడ్రా వేటు

స్మిత తగ్గేదేలే.. సర్కారు తగ్గుతుందా?

పోలీసులు పిలిచారు.. స్మిత వెళ్లారు.. వివరణ ఇచ్చారు.. అక్కడితో ఆగిపోతే సరిపోయేదేమో అంటున్నారు. టార్గెట్ చేశారనేలా మళ్లీ ఓపెన్‌ కామెంట్స్ చేయడంతో స్మిత సభర్వాల్ సర్కారుతో కయ్యం పెట్టుకునేలా బిహేవ్ చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఐఏఎస్‌ల నుంచి ఇలాంటి రిటర్న్ కౌంటర్లు చాలా అరుదు. ఓ ప్రభుత్వ విభాగాధిపతిగా ఉండి HCU ఫేక్ ఇమేజ్‌ను షేర్ చేయడమే ఒక తప్పని అనుకుంటుంటే.. ఇప్పుడిలా టార్గెట్ చేశారా? 2 వేల మందిపై చర్యలు తీసుకుంటారా? అంటూ వివాదం మరింత ముదిరేలా చేస్తు్న్నారని ఉన్నతాధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి, స్మిత ఎపిసోడ్‌ను సర్కారు ఎలా రిసీవ్ చేసుకుంటుందో? లైట్ తీసుకుంటుందా? యాక్షన్‌కు సిద్ధమవుతుందా? చూడాలి ఏం జరుగుతుందో..

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×