Elon Musk Earth To Earth Travel: ఇండియా నుంచి అమెరికాకు జర్నీ చేయాలంటే సుమారు 14 గంటల సమయం పడుతుంది. ఇండియా నుంచి దుబాయ్ కి వెళ్లి, అక్కడి నుంచి మరో విమానం ద్వారా అమెరికాకు చేరకోవాల్సి ఉంటుంది. ఇప్పుడిప్పునే ఇండియా నుంచి నేరుగా అమెరికాకు విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. భవిష్యత్ లో 14 గంటల ప్రయాణం కాస్త 18 నిమిషాలు కానుంది. వినడానికి షాకింగ్ గా ఉన్నా నిజం కాబోతోంది. భూమ్మీద ఏ ప్రదేశానికైనా కేవలం నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. ఎలా? ఏంటి? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో పూర్తిగా తెలుసుకుందాం..
అంతా మస్క్ మామ టాలెంట్!
ప్రపంచంలోని ఏ మూలకైనా నిమిషాల్లో చేరుకునేలా స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ప్రయోగాలు మొదలుపెట్టారు. మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ ఎర్త్ టు ఎర్త్ ట్రావెల్ రాకెట్ ను డిజైన్ చేస్తోంది. ప్రస్తుతం మనం రాకెట్లను అంతరిక్షంలోకి వెళ్లేందుకు, లేదంటే వేరే గ్రహాన్ని చేరుకోవడానికి ఉపయోగిస్తున్నాం. కానీ, ఎర్త్ టు ఎర్త్ రాకెట్ ద్వారా భూమ్మీద ఉన్న ఏ ప్లేస్ నైనా నిమిషాల్లో రీచ్ కావచ్చు. హైదరాబాద్ నుంచి అమెరికాకు కేవలం 18 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. ఈ టెక్నాలజీని స్పేస్ ఎక్స్ శరవేగంగా డెవలప్ చేస్తోంది. 10 నుంచి 15 ఏళ్లలో ఈ రాకెట్లను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది.
స్పేస్ రంగంలో ఎలన్ మస్క్ సరికొత్త ఘనత
ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని, ఓ అరుదైన ఘనత సాధించారు. అదే, రీ యూజబుల్ రాకెట్స్. ఇప్పటి వరకు ఏ దేశానికి ఇది పాజిబుల్ కాలేదు. అలాంటి ఘటనతను కొన్ని సంవత్సరాల క్రితమే మస్క్ సాధించారు. ఇప్పటికీ, ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిగతా అన్ని దేశాలు ఉపయోగించే రాకెట్లు. దీపావళికి మనం ఉపయోగించే రాకెట్ల మాదిరివి. ఒక్కసారి వాటిని ఉపయోగించామా, మళ్లీ యూజ్ చేయలేం. కానీ, ఎలన్ మస్క్ తన రాకెట్లను రీ యూజ్ చేయగలడు. ఈ పద్దతి ద్వారా ఆయన కోట్ల రూపాయల డబ్బును సేవ్ చేస్తున్నాడు.
ప్రపంచ రవాణా రంగంలో ఊహించని మలుపు
రాకెట్ టెక్నాలజీలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న మస్క్.. ఇప్పుడు ఎర్త్ టు ఎర్త్ రాకెట్ల తయారీ మీద ఫోకస్ పెట్టాడు. వీలైనంత త్వరగా ఈ రాకెట్లను అందుబాటులోకి తీసుకురాలని భావిస్తున్నాడు. ప్రపంచ ప్రయాణ రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతున్నాడు. ఆయన చేపట్టిన ఏ ప్రాజెక్ట్ కూడా ఇప్పటి వరకు ఫెయిల్యూర్ అనేది లేదు. అలాంటి మస్క్ ఎర్త్ టు ఎర్త్ రాకెట్ ప్రాజెక్ట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం ద్వారా, ప్రపంచ రవాణా రంగానికి అదిరిపోయే బూస్టింగ్ ఇవ్వబోతున్నారు. ప్రజలను అత్యంత వేగంగా, సేఫ్ గా గమ్యస్థానానాలకు చేర్చబోతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
Read Also: దేశంలో అత్యంత అందమైన రైల్వే స్టేషన్లు, ఒక్కసారైనా చూడాల్సిందే బ్రో!