Lavanya: రాజ్ తరుణ్ లావణ్య గొడవ రోజురోజుకీ ముదురుతుంది. నిన్న రాజ్ తరుణ్ పేరెంట్స్ తో గొడవపడి, వారిని ఇంటి నుంచి బయటికి పంపించింది లావణ్య. రాజ్ తరుణ్ పేరెంట్స్ మీడియా ముందుకు వచ్చి, ఆ ఇల్లు లావణ్యాది కాదని.. అది రాజ్ తరుణ్ ఇల్లు అని చెప్పిన తరువాత తిరిగి మరలా, వారిని అదే ఇంట్లో ఉండడానికి లావణ్య అంగీకరించింది. మీడియాతో వారిని నా తల్లితండ్రిగా చూస్తున్న అని చెప్పింది. ఈ గొడవ ఇలా జరుగుతున్న టైంలో ఇప్పుడు మరోసారి లావణ్య పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు తీసుకుంటా అంటూ.. మీడియా ముందుకు వచ్చింది.
ప్రాణాలు వదిలేస్తాను ..లావణ్య ..
లావణ్య పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు తీసుకుంటాను అని, నార్సింగ్ పట్నం పోలీస్ స్టేషన్ ఎదురుగా హల్చల్ చేస్తోంది. నిన్న కంప్లైంట్ ఇచ్చాను అయినా కానీ పోలీస్ వారు ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు. నాపై ఫిజికల్ గా దాడి జరుగుతుంది. లావణ్య రోడ్డుపై బైఠాయించింది నిన్న మళ్ళీ మా ఇంటికి నలుగురు మహిళలు వచ్చారు. రాజ్ తరుణ్ శేఖర్ బాషా నా మీద దాడి చేయిస్తున్నారు. పోలీసులు కూడా నాకు న్యాయం చేయడం లేదు. వాళ్ళు ఎవరో నన్ను చంపే బదులు నేనే పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రాణాలు వదిలేస్తాను అంటూ లావణ్య మీడియాతో తెలిపింది. కోర్టులో కేసు ఉండగా ఇలా నాపై దాడి చేయడం కరెక్ట్ కాదు అంటుంది లావణ్య.. ఇక్కడే పోలీస్ స్టేషన్ ఎదురుగా నేను ధర్నాకు దిగడం కాదు ప్రాణాలే అర్పిస్తాను అని లావణ్య మీడియాతో తెలిపింది. ఈ గొడవ ఎటు దారితీస్తుందో చూడాలి.
పోలీస్ స్టేషన్ ముందే నా ప్రాణాలు తీసుకుంటా : లావణ్య
నిన్న మళ్లీ మా ఇంటికి నలుగురు మహిళలు వచ్చారు
రాజ్ తరుణ్, శేఖర్ బాషా నాపై దాడి చేయిస్తున్నారు
పోలీసులు కూడా నాకు న్యాయం చేయడం లేదు
వాళ్లు ఎవరో నన్ను చంపే బదులు నేనే పోలీస్ స్టేషన్ ఎదురుగా ప్రాణాలు వదిలేస్తా
– లావణ్య pic.twitter.com/qkELyBNmwN
— BIG TV Breaking News (@bigtvtelugu) April 19, 2025