Big Stories

Inter: విద్యార్థుల్లారా, ఆత్మహత్యలు వద్దు.. ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఉందిగా..

inter student suicide

Inter results news(Latest updates in Telangana): క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతూ వస్తున్నాయి. ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని, మార్కులు తక్కువగా వచ్చాయని తెలంగాణలో 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనే నిజాన్ని బయటకు చెప్పుకోలేక అవమానంగా భావిస్తూ తనువు చాలిస్తున్నారు.

- Advertisement -

హైదరాబాద్ శివారు వనస్థలిపురంలో ఇంటర్ విద్యార్థిని గాయత్రం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఫస్టియర్ చదువుతున్న చెల్లి పాస్ కాగా.. సెకండ్ ఇయర్ చదివే అక్క గాయత్రి పరీక్షలో ఫెయిల్ కావడంతో అవమానంగా భావించింది. ఆత్మహత్య చేసుకొని కుటుంబంలో విషాధం నింపింది.

- Advertisement -

జగిత్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ మొదటి ఏడాది చదువుతున్న మేడిపల్లికి చెందిన విద్యార్థి 4 సబ్జెక్టుల్లో ఫెయిలయ్యానని మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ కాలేజీలో చదువుతున్న ఆర్మూర్ విద్యార్థి 3 సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. పటాన్‌చెరులో ఇంటర్‌ ఎంపీసీ చదువుతున్న తిరుపతికి చెందిన విద్యార్థి ఫెయిల్‌ అవుతాననే మనస్తాపంతో రైలు పట్టాల కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదువుతున్న గద్వాలకు చెందిన విద్యార్థి మొదటి ఏడాదిలో ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ కావడంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థిని హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది. ఫెయిల్‌ అయ్యాననే మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుంది.

సికింద్రాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో ఠాణా పరిధి వినాయక్‌ నగర్‌కు చెందిన విద్యార్థి ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ అవడంతో ఇంట్లో ఉరేసుకున్నాడు. ఖైరతాబాద్‌ తుమ్మలబస్తీకి చెందిన ఇంటర్ విద్యార్థి ఒక సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

నారాయణపేట జిల్లా కొత్తకోటకు చెందిన ఓ విద్యార్థిని మార్కులు తక్కువగా వచ్చాయని మనోవేదనకు గురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్‌లో ఫెయిలయ్యానని మనస్తాపంతో పటాన్‌చెరులో ఓ విద్యార్థిని అదృశ్యమైంది.

ఇలా ఇంటర్ విద్యార్థుల పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడటం విషాధకరం. పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రాన పోయేదేమీ ఉండదు. జీవితం ఇంకా పెద్దది. మరో అవకాశం ఉంటుంది. విద్యార్థుల్లారా.. క్షణికావేశం వద్దు. ప్రాణాలు తీసుకోవద్దు. కుటుంబానికి శోకాన్ని మిగల్చవద్దు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News