E-Paper
Advertisement

తెలంగాణ అమ్మాయిలకు బంపరాఫర్.. ఉచిత పైలట్ ట్రైనింగ్, ఇంకెందుకు ఆలస్యం

తెలంగాణ అమ్మాయిలకు బంపరాఫర్.. ఉచిత పైలట్ ట్రైనింగ్, ఇంకెందుకు ఆలస్యం
Advertisement

Telangana: పైలట్ కావాలని చాలామంది ఎన్నో కలలు కంటారు. భారీ ఖర్చుతో కూడినది కావడంతో చాలామంది ఆ ఊసు ఎత్తరు. ఆ పేరు ఎత్తడానికి ఇష్టపడరు. తాజాగా తెలంగాణ అమ్మాయిలకు గోల్డెన్ ఛాన్స్. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు ఉచితంగా పైలట్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ఇంటర్ విద్యాశాఖ-ఇండిగోరీచ్-భారత్ కేర్ ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది.

తెలంగాణ అమ్మాయిలకు బంపరాఫర్

ఈ మధ్యకాలంలో అమ్మాయిలు లేని రంగం లేదు. అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారు. ఏవియేషన్ సెక్టార్‌లో మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా తెలంగాణ అమ్మాయిలకు సువర్ణ అవకాశం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థినులకు ఉచితంగా పైలట్ ట్రైనింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ-ఇండిగోరీచ్-భారత్ కేర్ ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది.

ఇంటర్ చదివితే చాలు.. ఉచిత పైలట్ ట్రైనింగ్

Advertisement

గివింగ్ వింగ్స్ టూ ఫ్లై కార్యక్రమం కింద 20 నెలల ట్రైనింగ్ ఇస్తారు. కమర్షియల్ పైలట్ లైసెన్స్, ఏటీఆర్ టైప్ రేటింగ్‌తోపాటు వసతి, భోజనం, బీమా, మెంటార్ ‌షిప్, కెరీర్ మార్గదర్శకత్వం ఫ్రీగా లభించనున్నాయి. అందుకు విద్యార్థులు చేయాల్సింది ఒక్కటే. అర్హులైన విద్యార్థినులు పైలట్ ట్రైనింగ్‌కు సంబంధించిన అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాలి.

20 నెలలపాటు ట్రైనింగ్, అంతా ఆ సంస్థలదే

విమాన రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు ఉన్నతస్థాయి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా చెప్పుకొచ్చారు నిర్వాహకులు. ట్రైనింగ్ సమయంలో విద్యార్థినులపై ఆర్థిక భారం పడకుండా అన్ని ఖర్చులు ఇండిగోరీచ్-భారత్ కేర్ సంస్థలు భరించనున్నాయి. సాధారణ కుటుంబాలకు చెందిన టాలెంట్ విద్యార్థినులు పైలట్‌ విభాగంలో తమ కలను సాకారం చేసుకునే గొప్ప అవకాశం.

Advertisement

ALSO READ: హైడ్రా బాస్ సంతకానికి ఎసరు.. రంగనాథ్ పేరుతో నకిలీ ఎన్ఓసీలు, కాలేజీలపై కేసులు

తెలంగాణలో ప్రభుత్వ-ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజీలకు వీటికి సంబంధించిన వివరాలను ఇంటర్మీడియట్ విద్యాశాఖ అందించనుంది. దీనిపై భారత్‌కేర్స్ అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించనుంది. దీనివల్ల విద్యార్థినులకు పూర్తి సమాచారం ఇవ్వనుంది. అర్హులైన విద్యార్థినులు సదరు సంస్థకు చెందిన అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఎంపికైన అభ్యర్థులకు దశల వారీగా ట్రైనింగ్ ఇవ్వనుంది.

Related News

సీఎం రేవంత్‌రెడ్డి సూచన.. వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు కొత్త పేర్లు, కాకతీయులకు పేర్లపై అందరిచూపు

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

Big Stories

Advertisement
×