బంగారం కొంటే చాలు.. కష్టకాలంలో ఆదుకుంటుందనే నమ్మకం మనది. ధర పెరిగినా పర్వాలేదు.. బంగారం ఎప్పటికైనా లాభమే తెస్తుందనే ధీమా ఉంటుంది. కానీ ఇప్పుడు సీన్ మారింది. గతేడాది ధన త్రయోదశికి మీరు 10 గ్రాముల బంగారం కొన్నారనుకుందాం. ఏడాది తర్వాత దాని విలువ పెరిగింది. కానీ ఎంత పెరిగింది? అదే డబ్బును బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టి ఉంటే ఇంకా ఎక్కువ రాబడి వచ్చేదా? మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్నా.. బంగారం ధరలు ఎందుకు పడిపోయాయి? అసలు ఈ ధన త్రయోదశికి బంగారం కొనడం లాభమా? నష్టమా? లేక సంప్రదాయం కోసం కొనడమే మంచిదా?
ముందుగా బంగారం ధరల దగ్గరకు వద్దాం. ఈ ఏడాది నవంబర్ 6న ధన త్రయోదశి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర సుమారు రూ.లక్షా 38 వేల నుంచి రూ.లక్షా 41 వేల మధ్య ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.లక్షా 27 వేల నుంచి రూ.లక్షా 29 వేల రేంజ్‌లో కొనసాగుతోంది. వీటికి జీఎస్టీ, తరుగు, మజూరీ ఖర్చులు అదనం.
ఇక గతేడాది ధన త్రయోదశి టైమ్‌కి 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర లక్షా 30 వేల నుంచి లక్షా 34 వేల మధ్య ఉండేది. అంటే ఏడాదిలో బంగారం ధర అటు ఇటుగా 5.5 నుంచి 7.6 శాతం పెరిగింది. సింపుల్‌గా చెప్పాలంటే.. గతేడాది 10 గ్రాముల బంగారం కొన్నవారికి ఇప్పుడు దాదాపు 8 వేల నుంచి 10 వేల వరకు విలువ పెరిగినట్లు లెక్క. వినడానికి బాగానే ఉంది కదా.
కానీ ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అక్కడి నుంచి గణనీయంగా తగ్గాయి. అంటే ఒకవైపు గతేడాదితో పోలిస్తే ధర పెరిగినా.. ఈ ఏడాది గరిష్ఠ స్థాయితో పోలిస్తే మాత్రం బంగారం కొనేవారికి కొంత షాక్ తప్పలేదు.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్‌ను చూస్తే ఓ ఇంట్రెస్టింగ్ ట్రెండ్ కనిపిస్తోంది. ఒకవైపు సెంట్రల్ బ్యాంకులు, పెద్ద సంస్థాగత పెట్టుబడిదారులు బంగారం కొనుగోళ్లను పెంచుతున్నారు. జులై నుంచి సెప్టెంబర్ వరకు థర్డ్ క్వార్టర్‌లో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ఏకంగా 321 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఇది 42 శాతం ఎక్కువ. అటు గోల్డ్ ఈటీఎఫ్‌లలో కూడా మళ్లీ ఇన్వెస్ట్‌మెంట్‌లు పెరిగాయి. అంటే పెద్ద ఇన్వెస్టర్లు బంగారంపై మళ్లీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ చిన్న ఇన్వెస్టర్ల దగ్గర మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా బంగారు నాణేలు, బిస్కెట్ల కొనుగోళ్లు 19 శాతం తగ్గాయి. నగల డిమాండ్ కూడా 17 శాతం పడిపోయింది. దీనికి రీజన్ భారీ ధరలు.
ధన త్రయోదశి, దీపావళి సీజన్‌లో బంగారం కొనుగోళ్లకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. జులై-సెప్టెంబర్ మధ్య భారత్‌లో బంగారం డిమాండ్ అంతకుముందు క్వార్టర్ కంటే పెరిగింది. కానీ లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే మొత్తం డిమాండ్ మాత్రం 29 శాతం తక్కువగా ఉంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇండియన్స్ డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు పెంచారు. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు చూస్తే ఈ పెరుగుదల ఏకంగా 76 శాతం ఉంది. అంటే బంగారం కొనడం మానేయలేదు.. కొనుగోలు చేసే విధానం మాత్రం మారుతోంది.
సాధారణంగా యుద్ధాలు, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభాలు వచ్చినప్పుడు ఇన్వెస్టర్లంతా బంగారం వైపు చూస్తారు. ఎందుకంటే బంగారం సేఫ్ హెవెన్ అనేది వారి ఆలోచన. కానీ 2026లో అలా జరగలేదు. మీకు గుర్తుందా.. మే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అవసరం లేనప్పుడు బంగారం కొనుగోళ్లను తగ్గించాలని, పెళ్లిళ్లలో కూడా ఒక ఏడాది పాటు బంగారం కొనకుండా ఉండాలని రిక్వెస్ట్ చేశారు. సెప్టెంబర్‌లోనూ అనవసర కొనుగోళ్లను తగ్గించాలని మరోసారి చెప్పారు. దీనికి రీజన్.. దేశ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉంది. ఎందుకంటే మనం తన అవసరాలకు సరిపడా బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే మనం బంగారం ఎక్కువగా కొంటే.. దాని కోసం విదేశీ కరెన్సీ, ముఖ్యంగా డాలర్లు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో దిగుమతుల బిల్లు పెరుగుతుంది. కరెంట్ అకౌంట్ లోటుపై ప్రెజర్ పెరుగుతోంది. ఇన్ డైరెక్ట్‌గా రూపాయి విలువపైనా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే వ్యక్తిగతంగా బంగారం కొనుగోలు అనేది సంప్రదాయం అయినా.. దేశ ఆర్థిక వ్యవస్థ కోణంలో చూస్తే దాని ఇంపాక్ట్ చాలా ఎక్కువ. అందుకే మోదీ కాస్త ఆచి తూచి వ్యవహరించండి అని చెబుతున్నారు.
గతేడాది ధన త్రయోదశికి బంగారం కొన్నవారికి ఏడాదిలో సుమారు 5.5 నుంచి 7.6 శాతం విలువ పెరిగింది అని చెప్పకున్నాం కదా. కానీ ఈ రాబడిని ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇతర ఇన్వెస్ట్‌మెంట్లతో కంపేర్ చేసి చూడాలి. ఎందుకంటే బంగారం ధరలు రోజురోజుకూ మారుతుంటాయి. నగల విషయంలో తరుగు, మజూరీ, జీఎస్టీ వంటి ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి మార్కెట్ ధర పెరిగినంత మాత్రాన కొనుగోలుదారుడికి అంతే స్థాయిలో లాభం వస్తుందని చెప్పలేం.
Also Read: ఆ రోడ్డు మీద నిలబడి.. ఏం కోరుకున్నా జరిగిపోద్ది, కానీ.. మీ ఆత్మను సైతాన్‌కు రాసివ్వాలట!
ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ ఏంటంటే.. బంగారం డిమాండ్ ఎలా ఉంది.. ధర ఈ ఏడాది గరిష్టం నుంచి ఇప్పుడు కనిష్టానికి ఎందుకు పడింది? ఇలా అన్నింటిని ఒకసారి గుర్తు తెచ్చుకొండి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి. నిజానికి బంగారం కొనడం అనేది అది మీ అవసరం, పెట్టుబడి లక్ష్యం, ఆర్థిక స్థోమతపై ఆధారపడి ఉంటుంది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. బంగారం సంప్రదాయం కావొచ్చు.. భద్రత కావొచ్చు.. పెట్టుబడి కూడా కావొచ్చు. కానీ ప్రతి ధర దగ్గరా అది లాభాల బంగారు గనిగా మారుతుందని మాత్రం అనుకోవద్దు. సో.. సంప్రదాయం కోసం నామమాత్రంగా కొంటారా? లేక ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్‌లో భారీగా కొంటారా? అనే దానిపై ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బంగారం మెరుపు చూసి కాదు.. మార్కెట్ లెక్క చూసి కొనాలి అనేది ఎక్స్‌పర్ట్స్ మాట.