E-Paper
Advertisement

హైడ్రా బాస్ సంతకానికే ఎసరు.. ఏకంగా రంగనాథ్ పేరుతో నకిలీ NOCలు, 8 కాలేజీలపై కేసు!

హైడ్రా బాస్ సంతకానికే ఎసరు.. ఏకంగా రంగనాథ్ పేరుతో నకిలీ NOCలు, 8 కాలేజీలపై కేసు!
Advertisement

Fake HYDRAA NOCs: హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణతో పాటు అనుమతుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న హైడ్రా పేరుతో కొందరు కేటుగాళ్లు దగాకు తెరతీశారు. ఏకంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఐపీఎస్ సంతకాన్నే ఫోర్జరీ చేసి నకిలీ ఎన్‌ఓసీలు సృష్టించడం సంచలనం సృష్టిస్తోంది.

నకిలీ ఎన్‌ఓసీల దందా

Advertisement

నగరంలోని ఎనిమిది ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు పొందడానికి ఫైర్ సేఫ్టీ ఎన్‌ఓసీలు తప్పనిసరి. అయితే, ఈ కళాశాలల యాజమాన్యాలు హైడ్రా నుంచి ఎలాంటి ఫైర్ ఎన్‌ఓసీలు పొందకుండానే, కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలను తయారు చేశాయి. ఆ తర్వాత వాటిని ఇంటర్ బోర్డు అధికారులకు సమర్పించి గుర్తింపు పొందేందుకు యత్నించాయి.

పోలీసులకు ఫిర్యాదు.. కేసు నమోదు

Advertisement

ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల పరిశీలనలో ఈ నకిలీ ఎన్‌ఓసీల వ్యవహారం బయటపడింది. దీనిపై వెంటనే స్పందించిన హైడ్రా అధికారులు, విచారణ జరిపి సదరు ఎనిమిది కళాశాలల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జలగండంపై నిబంధనల ప్రకారం లేక్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

గుర్తింపు రద్దుకు సిఫార్సు

అక్రమాలకు పాల్పడిన ఆ ఎనిమిది ప్రైవేట్ కళాశాలల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటర్మీడియట్ బోర్డుకు లేఖ రాశారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ, ఫోర్జరీ పత్రాలతో మోసానికి పాల్పడిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనతో మిగతా ప్రైవేట్ విద్యాసంస్థల్లో కలకలం రేగింది.

Also Read: మంత్రుల పేషీల్లో ‘షాడో’ లీడర్లు.. CCTV కెమెరాల్లో దొరికిపోయిన ‘పైరవీ’ నేతలు!

Tags

Related News

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. ఇద్దరి ప్రాణాలు గాల్లో

ప్రభుత్వ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్.. యూనిఫాంలో కొత్త మార్పులు!

కల్వకుంట్ల ఫ్యామిలీ భూములపై రచ్చ.. మధ్యలో రైతుల్ని ఎందుకు లాగుతున్నారు?..ఆది శ్రీనివాస్ ఫైర్

ఢిల్లీ కేంద్రంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అయ్యేనా..?

తెలంగాణ యువతకు డెల్ సంస్థ బిగ్ ఆఫర్.. అన్నీ ఉచితం!

మూడు రోజుల డెడ్‌లైన్.. జూరాల ప్రాజెక్టు నీటిపై ఎంపీ డీకే అరుణ అల్టిమేటం?

అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!

సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. 45 రోజుల్లో ఆ దరఖాస్తులకు పరిష్కారం..?

Big Stories

Advertisement
×