E-Paper
Advertisement

హుస్నాబాద్ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 6.10 కోట్ల నిధులు మంజూరు!

హుస్నాబాద్ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 6.10 కోట్ల నిధులు మంజూరు!
Advertisement

Husnabad Temples: హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో దేవాదాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయం, హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం, పొట్లపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల అభివృద్ధికి సంబంధించి చేపట్టాల్సిన నిర్మాణ పనులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.

రూ.3.80 కోట్లు..

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధికి రూ.3.80 కోట్లు, హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధికి రూ.80 లక్షలు, పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.1.50 కోట్లు కేటాయించిన నేపథ్యంలో, మంజూరైన నిధులతో చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. ఆలయాల నిర్మాణాలు భక్తుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు అనుగుణంగా, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ చేపట్టాలని మంత్రి సూచించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ స్థపతి, ఇతర అధికారులు, పండితులు, నిపుణులతో ఆలయాల నిర్మాణ ప్రణాళికలు, అభివృద్ధి పనులపై చర్చించారు.

ప్రత్యేక నిర్ణయాలు

Advertisement

హుస్నాబాద్ నియోజకవర్గంలోని మూడు ప్రధాన ఆలయాల అభివృద్ధి పనులకు కార్తీక మాసంలో శంకుస్థాపన చేసేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయ గర్భగుడిని రాతి కట్టడంగా నిర్మించాలని నిర్ణయించారు. పొట్లపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. నిర్మాణ పనులు ప్రారంభమైన అనంతరం ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా కొనసాగించేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మంత్రి సూచించారు.

మెరుగైన సౌకర్యాలు..

హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేసి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, దేవాదాయ శాఖ స్థపతి శ్రీ వల్లి నాయగం, దేవాదాయ శాఖ డీఈ ఓం ప్రకాష్, ఈవో కిషన్ రావు , పండితులు వినయ్ శర్మ, సతీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: ఐస్‌క్రీమ్‌ను ఇలా కూడా తయారుచేయొచ్చా? ఈ జపనీస్ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!

Tags

Related News

మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి!

ఆగమైతున్న హైదరాబాద్.. నిరసన పేరిట వేల లీటర్ల నీరు వృథా.. రగిలిపోతున్న ప్రజలు!

అబద్ధాల ప్రచారంలో బీఆర్ఎస్ నంబర్ వన్.. జగదీశ్ రెడ్డికి యెన్నం శ్రీనివాస్ కౌంటర్!

సదర్ సమ్మేళనంలో.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటనలు!

హైదరాబాద్ ED బిగ్ ఆపరేషన్.. అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ గుట్టురట్టు!

మల్కాజిగిరిలో చెత్త సమస్యలకు చెక్.. ఎంఎంసీ కమిషనర్ సంచలన నిర్ణయాలు!

ఎంపీలో తెలంగాణ యువతి ఆత్మహత్య.. బీటెక్ థర్డ్ ఇయర్, వెలుగులోకి షాకింగ్ విషయాలు,

Big Stories

Advertisement
×