E-Paper
Advertisement

నవ్వుతూ కస్టమర్‌గా వచ్చి 4 తులాల బంగారం లేపేశాడు.. కానీ చివరికి..?

నవ్వుతూ కస్టమర్‌గా వచ్చి 4 తులాల బంగారం లేపేశాడు.. కానీ చివరికి..?
Advertisement

Gold Theft: జువెలరీ షాపులో కస్టమర్‌గా ప్రవేశించి, యజమాని దృష్టి మరల్చి బంగారు చెవి రింగులను అపహరించిన వ్యక్తిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి చోరీకి గురైన నాలుగు తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని వీరారెడ్డి నగర్‌ ఎక్స్‌ రోడ్డులో ఉన్న రాందేవ్‌ జువెలరీ షాపునకు ఈ నెల 2న సాయంత్రం 7 గంటల సమయంలో ఓ వ్యక్తి కస్టమర్‌గా వచ్చాడు.

బంగారు చెవి రింగు..

షాపు యజమాని పనిలో నిమగ్నమై ఉండటాన్ని గమనించి, ఆయన దృష్టి మరల్చి బంగారు చెవి రింగులను అపహరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదుతో మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్‌ జలంధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. హనుమకొండ జిల్లా వడ్డేపల్లికి చెందిన శ్రీపతి నగేష్‌ (41)ను అరెస్టు చేశారు. విచారణలో అప్పులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా చోరీకి పాల్పడినట్లు నిందితుడు వెల్లడించాడు.

చోరీ సొత్తు స్వాధీనం..

Advertisement

కేసును త్వరితగతిన ఛేదించి నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న మేడిపల్లి పోలీసు అధికారులను, సిబ్బందిని మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌, ఉప్పల్‌ డీసీపీ అభినందించారు. జువెలరీ షాపుల యజమానులు అప్రమత్తంగా ఉండాలని, దుకాణాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఆభరణాలు చూపించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్‌స్పెక్టర్‌ జలంధర్‌ రెడ్డి సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Also Read: ‘తప్పు నంబర్ డయల్ చేశారు.. ధర్నా చేసుకోండి’.. రిజర్వేషన్లపై సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు!

Tags

Related News

‘హిందూ కాలేజ్‌ను ప్రైవేటీకరిస్తే ఊరుకోం’.. కేంద్రానికి కవిత హెచ్చరిక!

తెలంగాణలో మురసు తుఫాను ఎఫెక్ట్.. భారీగా దెబ్బతిన్న వరి పంటలు!

కాంగ్రెస్ సంచుల పార్టీ.. బీజేపీ చెప్పుల పార్టీ.. కేటీఆర్ ఘాటు విమర్శలు!

రూ. 400 కోట్ల ‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్.. ఈడీ ఎంట్రీతో సైబర్ కేటుగాళ్ల గుట్టురట్టు!

హుస్నాబాద్ ప్రజలకు భారీ గుడ్ న్యూస్.. రూ. 6.10 కోట్ల నిధులు మంజూరు!

మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి!

ఆగమైతున్న హైదరాబాద్.. నిరసన పేరిట వేల లీటర్ల నీరు వృథా.. రగిలిపోతున్న ప్రజలు!

Big Stories

Advertisement
×