E-Paper
Advertisement

Ind vs SA 2nd ODI: మ‌రోసారి 300 దాటిన టీమిండియా స్కోర్‌.. ద‌క్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే

Ind vs SA 2nd ODI: మ‌రోసారి 300 దాటిన టీమిండియా స్కోర్‌.. ద‌క్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే
Advertisement

Ind vs SA 2nd ODI: భారత్ – సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లోని రెండవ వన్డే డిసెంబర్ 3న చత్తీస్గడ్ రాయిపూర్ లోని షాహిద్ వీర్ నారాయణ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియాకి ఆశించిన శుభారంభం దక్కలేదు.

Also Read: Ind vs SA 2nd ODI: ఫస్ట్‌‌ బాల్ కే 10 పరుగులు సాధించిన య‌శ‌స్వి జైష్వాల్‌

తక్కువ పరుగులకే రోహిత్ – జైష్వాల్ అవుట్:

Advertisement

రోహిత్ శర్మ {14*}, యశస్వి జైష్వాల్ {22} తక్కువ పరుగులకే అవుట్ అయ్యారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ – రుతురాజు గైక్వాడ్ ఇన్నింగ్స్ ని ముందుకు నడిపించారు. వీరిద్దరూ సెంచరీలతో చెలరేగారు. వీరి తర్వాత కెప్టెన్ కే.ఎల్ రాహుల్ కూడా 66 పరుగులు చేశాడు. ఈ క్రమంలో రెండవ వన్డేలో భారత్ 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్ 2, బర్గర్ 1, ఎంగిడి 1 వికెట్ పడగొట్టారు. మొదట ఆచితూచి ఆడిన భారత ఓపెనింగ్ జోడిని బర్గర్ విడదీశాడు. 14 పరుగులు చేసిన రోహిత్ శర్మని కీపర్ క్యాచ్ గా పెవిలియన్ చేర్చాడు. దీంతో తొలి వికెట్ కి నమోదైన 40 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం కొద్దిసేపటికే యశస్వి జైస్వాల్ {22} ని మార్కో యాన్సెన్ అవుట్ చేయడంతో 62 పరుగుల వద్ద భారత్ తన రెండవ వికెట్ ని కోల్పోయింది. ఈ పరిస్థితులలో రుతురాజ్ గైక్వాడ్ – విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ తో జట్టును ఆదుకున్నారు. మొదట క్రీజ్ లో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్న ఈ జోడి.. ఆ తరువాత పోటీపడి పరుగులు చేసింది.

Also Read: Harshit Rana: గంభీర్‌ కొడుకు హ‌ర్షిత్ రాణా దూల తీర్చిన ఐసీసీ.. ఈ వెధ‌వ ప‌నులు త‌గ్గించుకో అంటూ

Advertisement

 

కోహ్లీ – గైక్వాడ్ సెంచరీలు:

ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ 83 బంతుల్లో 105 పరుగులు, విరాట్ కోహ్లీ 93 బంతుల్లో 102 పరుగులు చేశారు. అయితే రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేసిన అనంతరం మార్కో యాన్సెన్ బౌలింగ్ లో భారీ షాట్ కి ప్రయత్నించి టోనికి క్యాచ్ ఇచ్చాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్.. మార్క్రమ్ వేసిన 41 చివరి బంతికి అనవసరపు పరుగుకు ప్రయత్నించి రన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రవీంద్ర జడేజాతో కలిసి కేఎల్ రాహుల్ మరో అద్భుత భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ 43 బంతుల్లో 66 పరుగులు, రవీంద్ర జడేజా 27 బంతుల్లో 24 పరుగులు చేశారు. ఈ నేపథ్యంలో రెండవ వన్డేలో భారత్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది.

 

 

View this post on Instagram

 

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×