BigTV English

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడ్డంగా బుక్కైన హరీష్ రావు.. పోలీస్ విచారణకు సిద్దమేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడ్డంగా బుక్కైన హరీష్ రావు.. పోలీస్ విచారణకు సిద్దమేనా?

అగ్గిపెట్టె రావు అజ్ఞానం!
ట్యాపింగ్ ఉచ్చుతో కుట్రలకు తెర


⦿ ఫోన్ ట్యాపింగ్ కేసులో అడ్డంగా బుక్కైన హరీష్ రావు
⦿ రేపో మాపో పోలీస్ విచారణ ఖాయం
⦿ హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి ఖాకీలు
⦿ ఈలోపే కౌశిక్ రెడ్డితో ట్యాపింగ్ డ్రామా
⦿ ఎలాంటి ఆధారాలు లేకుండానే నానా రచ్చ
⦿ ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకునేందుకే నాటకాలు
⦿ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కుట్రలు
⦿ ప్రజా విజయోత్సవాల సమయంలో కార్యకర్తలను ఉసిగొల్పి కుయుక్తులు
⦿ వెంటనే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నేతల రిక్వెస్ట్

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం: Phone Tapping Case: బీఆర్ఎస్ ఓటమి తర్వాత గులాబీ నేతలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి అంటూ ప్రజా పాలన చేస్తోంది కాంగ్రెస్. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే బీఆర్ఎస్ కనుమరుగు అయ్యే ప్రమాదం ఉందని, ప్రభుత్వంపై కావాలని బురద జల్లే కుట్రలకు తెర తీశారు గులాబీ నేతలు. ఇప్పటికే ప్రభుత్వం ఏం చేపట్టినా రచ్చ చేయడం అలవాటుగా మార్చుకోగా, కేసుల్లో అడ్డంగా దొరికిపోయినా కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ అలజడులు సృష్టించే కుట్రలకు తెరతీశారు. దీనికి తాజాగా జరిగిన కౌశిక్ రెడ్డి ఉదంతమే ఉదాహరణ. ఆయన్ను ఉసిగొల్పి తనపై నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసును డైవర్ట్ చేసేందుకు హరీష్ రావు డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.


ఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో హరీష్ రావు
బీఆర్ఎస్ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయి. దీనిపై కేసు నడుస్తోంది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ నేతలు విచారణ ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ తన ఫోన్‌ను ట్యాప్ చేసిన హరీష్ రావు, బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులను ఆశ్రయించారు. రాధాకిషన్ రావు ద్వారా చంపేస్తామని బెదిరించారని, అక్రమ కేసుల్లో ఇరికించారని ఫిర్యాదులో వాపోయారు. తన ఫోన్లే కాకుండా, కుటుంబసభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ముప్పుతిప్పలు పెట్టారని ఆధారాలన్నీ పోలీసులకు అందజేశారు. దీంతో పోలీసులు హరీష్ రావు, రాధాకిషన్ రావు మీద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

హైకోర్టును ఆశ్రయించినా చుక్కెదురే
తనపై తప్పుడు కేసు పెట్టారని, దాన్ని కొట్టివేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు హరీష్ రావు. కానీ, అక్కడ ఆయనకు చుక్కెదురైంది. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చి విచారణ మస్ట్ అంటూ షాకిచ్చింది న్యాయస్థానం. కోర్టు ఆదేశాలతో పోలీసులు ముందుకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. రేపో మాపో విచారణకు పిలుస్తారని ప్రచారం జరుగుతోంది.

దీంతో హరీష్ రావు డ్రామాలు షురూ చేశారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. తాను ఏది చెప్తే అది చేసే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీస్ స్టేషన్‌కు పంపించి, ఎలాంటి ఆధారాలు లేని ఓ కంప్లయింట్ ఇప్పించి కొత్త డ్రామాకు తెర తీశారని చెబుతున్నారు. కావాలని పోలీసుల పనులకు విఘాతం కలిగించి అరెస్ట్ అయ్యేలా చేసుకున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా సంతోషంగా ప్రజా విజయోత్సవాలు జరుపుకుంటుంటే, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కుట్రలకు తెర తీశారని మండిపడుతున్నారు.

Warangal Bank Robbery: ఓర్నీ.. ఏకంగా SBI బ్యాంక్‌కే కన్నం వేశారు.. చివరికి ఇలా దొరికిపోయారు!

హరీష్‌ రావు నాటకాలు తెలియనివా?
గత పదేళ్లలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఎంత చెప్పినా, కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు హరీష్ రావు. కానీ, తాను ట్యాపింగ్ కేసులో అడ్డంగా దొరికిపోవడంతో, కౌశిక్ రెడ్డి ద్వారా డ్రామా క్రియేట్ చేసి, దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ప్రభుత్వం ట్యాప్ చేయిస్తోందన్నట్టు ఆరోపణలు చేస్తున్నారని, కుట్రలు చేసి హత్యలు జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టుగా అనిపిస్తోందని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి తప్పించుకునేందుకే, అగ్గిపెట్టె రావు తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటూ ఇలా ప్రవర్తిస్తున్నారని, వెంటనే ఆయన్ను అరెస్ట్ చేసి విచారించాలని కోరుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావుతో దోస్తీ చేసి, తనకు కావాల్సిన పనులు చేయించుకున్న హరీష్ రావు, ఇప్పుడు భయంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తెస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాగే వదిలేస్తే, పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడే ఛాన్స్ ఉందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు.
పూర్తి కథనం..

Related News

Kavitha: కవిత ఔట్.. బీఆర్ఎస్ సేఫ్.. ప్లాన్ అదుర్స్!

CM Revanth: మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక ఘట్టం.. హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీరు తరలించాలని నిర్ణయం!

Weather News: మళ్లీ భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, పిడుగులు పడే ఛాన్స్

KTR: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. కవితను అందుకోసమే సస్పెండ్ చేశాం..

Dussehra holidays: తెలంగాణలో దసరా సెలవు.. విద్యార్థులు ఫుల్ ఎంజాయ్, టూర్ ప్లానింగ్

T Fiber Net: తెలంగాణలో టీ-ఫైబర్‌.. దసరాకు మిస్సయితే, కార్తీకమాసం ఖాయం?

Big Stories

×