Brahmamudi serial today Episode: హాస్పిటల్‌లో అందరూ బాధపడుతూ ఉంటారు. ఇంతలో కళ్యాణ్ వస్తాడు. కళ్యాణ్‌ను చూసిన ఇందిరాదేవి ఎమోషనల్ అవుతుంది. నాన్నమ్మ, తాతయ్యకు ఏం కాదు. మేమంతా ఉన్నాము కదా అంటూ భరోసా ఇస్తాడు. కళ్యాణ్‌ను చూసిన రుద్రాణి వచ్చాడమ్మా ఓదార్పు యాత్రికుడు. అయినా ఆ ముసలాయనది పాతికేళ్ల గుండె అయినట్లు ఫీలవుతున్నారు. ఈ వయసులో ఆయన గుండె ఇంకా పనిచేయడమే చాలా పెద్ద విషయం అంటుంది. తాతయ్యకు ఏం జరిగింది అన్నయ్యా ఇప్పుడెలా ఉంది అన్నయ్యా అని కళ్యాణ్, రాజ్‌ను అడగ్గానే ఇంకా ఏమీ తెలియదు.. లోపల ట్రీట్‌మెంట్ జరగుతుంది అని చెప్తాడు.
లోపలి నుంచి డాక్టర్ వస్తాడు. డాక్టర్ మా తాతయ్యకు ఎలా ఉంది అని రాజ్ అడుగుతాడు. చెప్పండి డాక్టర్ ప్రాబ్లమ్ ఏమీ లేదు కదా…? అని అడగడంతో మా ప్రయత్నం మేము చేశాము.. కానీ బీపీ బాగా పెరిగిపోయి అది బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి ఆయన కోమాలోకి వెళ్లిపోయారు అని డాక్టర్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. మా నాన్నగారి ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదు కదా..? డాక్టర్ అని సుభాష్ అడగడంతో ఇప్పటివరకైతే హార్ట్ నార్మల్ గానే ఉంది. అంతా మంచే జరగాలని కోరుకుందాం అని చెప్పి డాక్టర్ వెళ్లిపోతాడు.
ఇందిరాదేవి ఏడుస్తుంది. కళ్యాణ్ వచ్చి అన్నయ్యా నాన్నమ్మ ఇక్కడే ఉంటే తాతయ్యను చూస్తూ ఉండలేదు. మీరు నాన్నమ్మను తీసుకుని ఇంటికి వెళ్లండి ఏమైనా ఉంటే నేను ఫోన్ చేస్తాను అని చెప్తాడు కళ్యాణ్. దీంతో ఇందిరాదేవి ఏడుస్తూ నేను ఎక్కడికి రాను ఇక్కడే ఉంటాను అని చెప్తుంది. అమ్మమ్మ గారు మీరు ఇక్కడే ఉండి మరో పేషెంట్ అవుతారా..? తాతాయ్యగారు మంచిగా అయి ఇంటికి వచ్చేసరికి మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఆయన సంతోషంగా ఉంటారు అని కావ్య చెప్తుంది. రాజ్ ఇందిరాదేవిని తీసుకుని వెళ్లిపోతాడు.
జరిగిన విషయం కనకానికి ఫోన్ చేసి చెప్తుందికావ్య . ఇంతలో మూర్తి వచ్చి కనకాన్ని పిలుస్తాడు. ఏమైందని అడుగుతాడు. పెద్దాయనకు గుండెపోటు వచ్చిన విషయం చెప్తుంది. మూర్తి షాక్ అవుతాడు. ఇప్పుడు ఆ పెద్దావిడ పరిస్థితి ఏంటి..అంటాడు. కానీ ఆయనకు అలా కావడానికి కారణం మన కావ్య అని అంటారేమోనని భయంగా ఉంది. కావ్య ఇంట్లో అడుగుపెడితే ఆయనకు ఇలా జరిగిందని అమ్మాయిని మళ్లీ నిందిస్తారని మనం ఒకసారి అక్కడకు వెళ్లి వద్దామా..? అని మూర్తిని అడుగుతుంది కనకం. ఇప్పుడు మనం అక్కడకు వెళితే ఆగ్నికి ఆజ్యం పోసిన వాళ్లం అవుతాం కనకం వద్దు అని చెప్తాడు మూర్తి.
రూంలో ఇందిరాదేవి ఒక్కతే కూర్చుని సీతారామయ్య ఫోటో చూస్తూ ఉంటుంది. ఇంతలో కావ్య వచ్చి ఎంటి అమ్మమ్మ గారు మీరిలా బాధపడుతూ ఉంటే ఇంట్లో వాళ్లు అందరూ ధైర్యంగా ఎలా ఉంటారు చెప్పండి. చెట్టంత మనిషి ఆ నాలుగు గోడల మధ్య ఉలుకూ పలుకూ లేకుండా పడి ఉంటే నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు కావ్య.. నాకు ఎంత అనుభవం ఉన్నా.. అదంతా మీ తాతయ్యగారి పక్కన ఉండి చూసిందే.. ఈరోజు ఆయనే పక్కన లేకుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ ఇందిరాదేవి బాధపడుతుంటే..
అమ్మమ్మ.. తాతయ్యగారు ప్రాణాలతో పోరాడుతున్నారు. కానీ మీరు మాత్రం ఆ నమ్మకం కోల్పోయి ఇలా బాధపడుతున్నారు. అమ్మమ్మ మీరు ఒక్కసారి ఆలోచించండి. తాతాయ్యగారి ఆరోగ్యం బాగుపడి ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇలా ఉంటే.. నా వల్ల నా చిట్టి ఇలా అయిపోయిందని ఆయన బాధపడరా..? అంటూ ధైర్యం చెప్తుంది కావ్య.. తన మాటలతో కన్వీన్స్ చేసి ఇందిరాదేవిని భోజనం చేయడానికి ఒప్పిస్తుంది.
అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. అన్నయ్యా ఆకలి వేస్తుంది వడ్డించుకని తిందామా..? అని రుద్రాణి అడుగుతుంది. అమ్మ రానివ్వు తిందాము అని సుభాష్ చెప్తాడు. ఇంతలో కావ్య, ఇందిరాదేవిని తీసుకుని వస్తుంది. అందరికీ కావ్య వడ్డిస్తుంది. అన్నం ముందు కూర్చున్న ఇందిరాదేవి బాధగా తినకుండా కూర్చుని ఉంటుంది. ఇంతలో రుద్రాణి ధాన్యలక్ష్మీ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పుడే అందరం కలిసి ఒక పరిష్కారం ఆలోచిస్తే బాగుంటుంది. నాన్నకు ఏదైనా జరగరానిది జరిగితే ఆ తర్వాత ఎవరికేం చేయాలో అర్థం కాకుండా పోతుంది. అంటూ రుద్రాణి అడగ్గానే కావ్య తిడుతుంది. ధాన్యలక్ష్మీ తరపున మాట్లాడటానికి ఎంత కమీషన్ తీసుకున్నారు అంటూ నిలదీస్తుంది. దీంతో అందరి మధ్య గొడవ జరుగుతుంది. అపర్ణ కూడా రుద్రాణి, ధాన్యలక్ష్మీని తిడుతుంది. అయితే ఇంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు కావ్యకు లేదంటుంది ధాన్యలక్ష్మీ.. దీంతో ప్రకాష్ ధాన్యలక్ష్మీని తిడతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?