BigTV English

YCP – Pushpa 2 Stampede: ఏపీ రాజకీయాల్లో బన్నీ ఫైరా.. ఫెయిల్యూరా? వైసీపీ కలలు నిజమవుతాయా?

YCP – Pushpa 2 Stampede: ఏపీ రాజకీయాల్లో బన్నీ ఫైరా.. ఫెయిల్యూరా? వైసీపీ కలలు నిజమవుతాయా?

YCP – Pushpa 2 Stampede: సినిమాలు వేరు.. పాలిటిక్స్ వేరు. సినిమా రంగం నుండి పాలిటిక్స్ లోకి అడుగు పెట్టి కొందరే సక్సెస్ అయ్యారు. కానీ పార్టీలు మాత్రం సినిమా కలర్ కోసం తెగ ఆరాటపడుతూనే ఉంటాయి. అందుకు కారణం ఫ్యాన్స్ ను ఒక్కసారిగా క్యాచ్ చేసుకోవాలన్నది పార్టీల అసలు ప్లాన్. అలా ఓ పార్టీ ప్రస్తుతం ఆ హీరో మావాడే అనే రేంజ్ లో తెగ ప్రచారం చేసుకుంటోంది. కానీ ఆ హీరో మాత్రం ఇదేందిరా నాయన.. ఈ గోల ఏంది అనుకుంటూ ఊ అనాలా.. ఊఊ అనాలా అనే రేంజ్ లో తెగ ఆలోచనలో పడ్డాడట. ఈ పరిస్థితి ప్రస్తుతం ఏపీలో ఉంది. హీరో కోసం తెగ తాపత్రయపడే పార్టీ వైసీపీ కాగా, హీరో ఎవరో ఈపాటికే అర్థమై ఉంటుంది.. అతడే స్టైలిష్ స్టార్ పుష్ప – 2 అల్లు అర్జున్.


మెగా, అల్లు ఫ్యామిలీ రెండు ఒకటేనంటారు. మెగాస్టార్ చిరంజీవి కాంపౌండ్ నుండి ఎందరో హీరోలు టాలీవుడ్ కి పరిచయమయ్యారు. వారిలో హీరో అల్లు అర్జున్ కూడా ఒకరు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా మెగాస్టార్ కు ఇచ్చే గౌరవంలో ఏనాడూ భేదాలు బయటపడలేదు. ఇటీవల మెగా కాంపౌండ్ నుండి హీరో పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ సమయాన ఆ ఫ్యామిలీ మొత్తం పవన్ వెంట ఉందన్నది అభిమానుల వాదన. ఏపీలో 2024 ఎన్నికల హీట్ ఎలా సాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకున్నాయి. కూటమిలో భాగమైన జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం జబర్దస్ట్ ఆర్టిస్ట్ లు కూడా ప్రచారం సాగించారు. చివరికి పవన్ విజయం సాధిస్తే, వారి ఫ్యామిలీ మొత్తం టీవీలకు అతుక్కుపోయి సంబరాలు జరుపుకున్నారు. కానీ ఈ ఎన్నికలే హీరో అల్లు అర్జున్ కి తిప్పలు తెచ్చాయని చెప్పవచ్చు. సాధారణంగా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా అల్లు అర్జున్ ప్రచారం సాగిస్తారన్నది చర్చ. కానీ బన్నీ రూట్ మార్చి అటు మెగా ఫ్యామిలీకి, అభిమానులకు భారీ షాకిచ్చాడు.


ఏపీలో జనసేన వర్సెస్ వైసీపీ మధ్య పొలిటికల్ వార్ పీక్ స్టేజీలో ఉండగా, హీరో అల్లుఅర్జున్ వేసిన ఒకే ఒక్క అడుగు సంచలనం సృష్టించింది. నంద్యాలకు చెందిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవి తనకు స్నేహితుడని చెప్పుకున్న బన్నీ, ఏకంగా నంద్యాలకు వెళ్లి జై కొట్టి శిల్పాను గెలిపించాలని హంగామా చేశాడు. అంతేకాదు శిల్పా విజయం నా విజయం అనే రేంజ్ లో మీడియా ముందు మాట్లాడాడు. అప్పుడే ఎన్నికల కమిషన్ కూడా సమాచారం లేకుండా బన్నీ నంద్యాల వచ్చాడంటూ.. కేసు కూడా నమోదు చేసింది. మళ్లీ ఆ కేసును కూడా కోర్టు కొట్టివేసింది. ఏ ముహూర్తాన్న అల్లు అర్జున్ తన ఫ్రెండ్ అని చెప్పుకుంటున్న వైసీపీ నేతకు మద్దతు ఇచ్చాడో గానీ.. అప్పటి నుంచి ఆయన ఆ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు.

ఎన్నికల ఫలితాలు తారుమారు కాగా, బన్నీ ప్రచారం చేసిన ఫ్రెండ్ కూడా ఓటమి పాలయ్యాడు. ఈ విషయం బన్నీకి మింగుడుపడని విషయంగా చెప్పవచ్చు. అయితే ఎంత చెప్పుకున్నా అసలు విషయం అదే. ఫ్యాన్స్ వేరు.. ఓటర్లు వేరు. హీరో చెబితే ఓట్లు రాలే రోజులు ఇంకా ఉన్నాయో లేవో కానీ నంద్యాలలో బన్నీ ఎఫెక్ట్ జీరోగానే కనబడింది. అయినప్పటికీ వైసీపీ అభ్యర్థికి మద్దతు పలికిన అల్లు అర్జున్ కు మాత్రం అప్పటి నుండే వైసీపీ ఫ్యాన్ గా మారింది. అది ఏ రేంజ్ లో అంటే, బన్నీ అంటే మావాడే మావాడే అంటూ తెగ ప్రచారం చేసుకుంటోంది. అసలే 11 సీట్లకు పరిమితమై ఊపిరాడని స్థితిలో గల వైసీపీ.. ఇలా ప్రచారం చేసుకోవడంలో కూడా తప్పులేదనే చెప్పవచ్చు. కారణం ఎవరి ఆరాటం వారిది.. ఎవరి పోరాటం వారిది.

ఈ పరిస్థితుల్లో బన్నీ నటించిన ‘పుష్ప 2’ విడుదలైంది. వైసీపీ మళ్లీ తెర మీదికి కాదు.. ఏకంగా ఓపెన్ అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు, రికార్డులు తిరగరాస్తుందని కూత వేయడాలు మొదలు పెట్టింది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే.. ఎవడయ్యా బన్నీ సినిమాను ఆపేది. సినిమా హిట్ అంటూ తెగ కామెంట్స్ చేశారు. సినిమా రిలీజ్ రోజు మాత్రం వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలలో పార్టీ కనిపించలేదు కానీ ఏ పేజీ చూసినా అల్లు అర్జున్ కనిపించాడు. మాకోసం నువ్వు వచ్చావు.. నీ కోసం మేము వస్తాం అంటూ ప్లెక్సీలు, థియేటర్లలో జగన్, బన్నీ ఫోటోలు ఇలా వైసీపీ మాత్రం ఓ రేంజ్ లో ప్రచారం సాగించుకుంది.

వైసీపీ మద్దతు ఎంతగా అంటే.. ఏపీ ప్రభుత్వం టికెట్లను అధిక ధరలకు విక్రయించేందుకు పుష్ప2కు అనుమతి ఇవ్వడాన్ని కూడా విమర్శించలేనంతగా మద్దతు సాగించింది. సాధారణంగా బన్నీ స్థానంలో మరే ఇతర హీరో మూవీ రిలీజ్ అయినా వైసీపీ నేతలు టికెట్ రేట్లపై హంగామా చేసేవారేమో. ఈ సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని అంటాయని అభిమానులు గగ్గోలు పెట్టినా, వైసీపీ మాత్రం ఒక్క మాట మాట్లాడని పరిస్థితి. ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మద్దతు లేనిదే, బన్నీ సినిమాకు రేట్లు పెరగవన్న విషయం అందరికీ తెలిసిందే. సినిమా వేరు రాజకీయాలు వేరనే తరహాలో పవన్ ఆలోచించే ఉంటారని భావించవచ్చు.

కూటమిలో భాగమైన జనసేన అద్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి బన్నీయే ‘సరైనోడు’ అని వైసీపీ కలలు కంటోంది. అందుకే మావాడే.. మావాడే అంటూ ప్రచారం సాగించింది. సినిమా వేరు పొలిటికల్ తీరే వేరన్న విషయం ఎన్నో సార్లు నిరూపితమైంది. పుష్ప2 సినిమా హడావిడి ముగిసిన తర్వాత అటు అల్లు అర్జున్ కెరీర్ ఏమో కానీ.. వైసీపీ ప్లానింగ్ ఏమిటన్నదే ఎవరికీ అర్థం కాని ప్రశ్న. 11 సీట్లతో స్ట్రచర్ మీద ఉన్న వైసీపీ, మళ్లీ బలోపేతం అయ్యేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టేలా లేదు.

Also Read: AP Politics: పుల్లలు పెట్టేద్దాం.. విజయసాయి రెడ్డికి ఈ ఐడియా ఇచ్చిందెవరో!

పుష్ప2 సినిమా క్రేజ్ ముగిసినా కూడా అల్లు అర్జున్ ను ఓన్ చేసుకుంటూనే, పవన్ కళ్యాణ్ కు మీవాడు మావాడే అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. బన్నీ కూడా ఈ హడావుడి ముగియగానే, సైలెంట్ ప్లీజ్ అంటూ సైడ్ అవుతాడా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఏదిఏమైనా అల్లు అర్జున్ వేసిన ఒక్క అడుగు, అతని కెరీర్ ను ప్రశ్నించే స్థాయికి వెళ్లడంలో వైసీపీ చాతుర్యం ప్రదర్శించిందని చెప్పవచ్చు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×