BRS : లిక్కర్ కేసులో జైలుకు వెళ్లొచ్చాక కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. నేనున్నానంటూ.. రాజకీయాల్లోనే ఉంటానంటూ.. తరుచూ అటెండెన్స్ వేసుకుంటున్నారు. ఉనికి చాటుకునేందుకు బాగా కష్ట పడుతున్నారని అంటున్నారు. తండ్రీ, అన్నకు భిన్నంగా.. బీసీ మంత్రం జపిస్తుండటం ఇంట్రెస్టింగ్. మరి, కవిత బీసీసూత్ర.. వర్కవుట్ అయ్యేనా? అసలు, కవితక్క పొలిటికల్ బతుకమ్మ క్లిక్ అయ్యేనా?
జాగృతా? గులాబీ రేకులా?
వరుసగా తెలంగాణ జాగృతి మీటింగ్స్ పెడుతున్నారు కవిత. పాత కేడర్‌ను మళ్లీ దగ్గరకు రప్పించుకుంటున్నారు. అలా తాను ఇంట్లో కూర్చునే రకం కాదని.. రాజకీయాల్లోనే ఉంటానని చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. బానే ఉంది. జాగృతి తర్వాత నెక్ట్స్ ఏంటి? గులాబీ జెండా నీడనే పొలిటికల్ కెరీర్‌ను కాపాడుకుంటారా? అనే డౌట్. ఇక్కడే క్లారిటీ రావాల్సి ఉంది.
కుల మేల? రణ మేల?
కులగణన. సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీఆర్ఎస్ సంపూర్ణంగా సహాయ నిరాకరణ చేసింది. ఇప్పటికీ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులు తమ కుటుంబ వివరాలు ఇవ్వనే లేదు. కానీ, కవిత మాత్రం కులగణనకు సహకరించారు. ఫ్యామిలీ డీటైల్స్ ఇచ్చారు. అదిగో చూడండి.. కవితను చూసైనా నేర్చుకోండంటూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ అండ్ కో ను గట్టిగానే కార్నర్ చేసింది. అదే టైమ్‌లో కవిత గులాబీ గూటి నుంచి సైడ్ అవుతున్నారనే ప్రచారమూ జరిగింది. వరుస పరిణామాలు చూస్తుంటే ఆ సందేహం నిజమే అనిపిస్తోంది.
కవిత ఒంటరి నడక..?
ఇటీవల తరుచూ ప్రెస్‌మీట్లు పెడుతున్నారు కవిత. అందులో ఆమెతో పాటు చెప్పుకోదగ్గ పేరున్న లీడర్ ఎవరూ పక్కన ఉండటం లేదని అంటున్నారు. నామ్ కే వాస్తే నాయకులతో కలిసి మీడియా ముందు మాట్లాడిపోతున్నారు. తాజాగా, అసెంబ్లీలో మహాత్మా ఫూలే విగ్రహం పెట్టాలంటూ.. ఇందిరాపార్కు దగ్గర కవిత చేసిన దీక్షకు బీఆర్ఎస్ నుంచి అంతగా సపోర్ట్ రాలేదనే విమర్శ వినిపిస్తోంది. కేసీఆర్ కూతురు కవిత చేపట్టిన దీక్షకు.. ఆ పార్టీ ప్రముఖ లీడర్లు ఎవరూ రాకపోవడం రాజకీయ గుసగుసలకు ఛాన్స్ ఇస్తోంది.
కమాన్ గుసగుస..
సొంత అజెండాతో కవిత.. సొంతంగా ఎదగాలని చూస్తున్నారా? పార్టీ సపోర్ట్ లేకుండా అది సాధ్యమేనా? కేటీఆర్, హరీష్ రావులదే ఆధిపత్యమంతా అని కవిత గుస్సా అవుతున్నారా? లేదంటే, కవితకు మళ్లీ పెత్తనం దక్కకుండా ఇంట్లోని వాళ్లే చెక్ పెడుతున్నారా? ఇలా రకరకాల టాక్స్.
బీసీ బొమ్మ చూపిస్తున్న ఓసీ లీడర్
కవిత బీసీ వాయిస్ ఎత్తుకోవడమే విచిత్రంగా ఉందంటున్నారు. కులగణనలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కవిత ఏమైనా బీసీనా? అంటూ ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి. అయినా, తగ్గట్లే. బీసీల జాతిపితలాంటి ఫూలే విగ్రహ ఏర్పాటు కోసం పట్టుబడుతూ.. బీసీ నేతగా ఎదగాలని ఈ ఓసీ లీడర్ భ్రమపడుతున్నారా? ఇప్పటికే బీసీలంతా బీఆర్ఎస్‌కు దూరమై.. 42శాతం రిజర్వేషన్ల తర్వాత కాంగ్రెస్‌కు జై కొడుతుండటంతో.. ఆ వర్గాన్ని మళ్లీ తనవైపు తిప్పుకునేలా కవిత రాజకీయ కుట్రలు చేస్తున్నారా? అని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి.
రేవంత్‌పై విమర్శలు ఉనికి కోసమేనా?
అటు, సీఎం రేవంత్ రెడ్డిపైనా విమర్శల డోస్ పెంచుతున్నారు కవిత. ఏఐతో ప్రమాదం లేదని.. అనుముల ఇంటెలిజెన్స్ ( AI ) తోనే తెలంగాణకు ప్రమాదమంటూ మళ్లీ మాటల గారెడీ షురూ చేశారు. కాంగ్రెస్ నుంచీ కవితకు స్ట్రాంగ్ కౌంటర్లే పడుతున్నాయి. ఆ ఏఐ వాడే బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేశారని గుర్తు చేశారు ఎంపీ చామల. జైలుకు వెళ్లొచ్చాక కవిత సొంత గ్రాఫ్ పెంచుకునే పనిలో పడ్డారని.. బాహుబలి మూవీలో మాహిష్మతి రాజ్యానికి లేడీ డాన్‌లా మారాలని కవిత కోరుకుంటున్నారని సెటైర్లు వేశారు.
Also Read : కేటీఆర్ మైండ్ గేమ్ బూమరాంగేనా? ఆ లాజిక్ మిస్ అయ్యారా?
కవిత కష్టం కవితకే తెలుసు..
అటు సొంతపార్టీ బీఆర్ఎస్ నుంచి సహాయ నిరాకరణ.. కుటుంబం నుంచి టచ్ మీ నాట్ అనేలా పరిస్థితులు.. ఎంత ట్రై చేస్తున్నా కనికరించని బీసీలు.. కాంగ్రెస్ నుంచి విమర్శలు.. ఇలా రాజకీయ ఉనికి కోసం కవిత చాలానే కష్టపడుతున్నారని.. కానీ, ఫలితమే కనిపించట్లేదనేది విశ్లేషకుల మాట.