Pawan Kalyan Son Health : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ నిన్న అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మార్క్ చదువుతున్న సింగపూర్ లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు కూడా అదే భవనంలో ఉండటంతో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. వెంటనే స్పందించిన స్కూల్ సిబ్బంది వెంటనే మార్క్ శంకర్ తోపాటు మిగితా పిల్లలను కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పేశారు. కానీ అప్పటికే మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు చెలరేగిన మంటల కారణంగా గాయాలయ్యాయి. మరోవైపు దట్టమైన పొగ రావడంతో ఊపిరితిత్తుల్లోకి నిండిపోయింది.. దాంతో మార్క్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మార్క్ పరిస్థితి మెరుగైందని వైద్యులు హెల్త్ బులిటెన్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆసుపత్రి లో ఉన్న మార్క్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోను చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఆక్సిజన్ మాస్క్ తో ఒంటినిండా గాయాలతో మార్క్ శంకర్ ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం..
సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 9:45 కి రివర్ వ్యాలీ షాప్ హౌస్ వద్ద చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో 19 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం పై వెంకటనే స్పందించిన సిబ్బంది ప్రమాదంలో చిక్కుకున్న అందరిని వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. వారిలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి మాత్రం తీవ్రంగా గాయాలు అయ్యాయి. నిన్న ఎమర్జెన్సీ వార్డులోంచి అతనికి పూర్తి చికిత్సను అందించారు. ప్రస్తుతం మార్క్ కోలుకుంటున్నాడు. హాస్పిటల్ బెడ్ పైన ఆక్సిజన్ మాస్క్ తో గాయాలతో కనిపిస్తున్న మార్క్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోని చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను ఇలా చూస్తామని అస్సలు అనుకోలేదు అంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్లు పెడుతున్నారు..
మార్క్ ఏం చేస్తున్నాడు..?
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పలువురు మార్క్ శంకర్ ని సింగపూర్ లో ఎందుకు ఉంచారు అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మార్క్ ను సింగపూర్‌లోని ఓ కుకింగ్ స్కూలుకు పంపిస్తున్నారు. రోజు వెళ్లేలాగే మంగళవారం ఉదయాన్నే మార్క్ స్కూలుకు వెళ్లాడు. అయితే అక్కడ ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో ప్రమాదం జరిగింది. ఈ క్రమంలో మార్క్ కాలు, చేతులకు కాలిన గాయాలయ్యాయి. దాంతోపాటు పొగను పీల్చేయడంతో ఊపిరితిత్తుల్లోకి ఎక్కువగా చేరుకుంది. ప్రస్తుతం మార్క్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. మార్క్ ఫోటోను డాక్టర్లు విడుదల చెయ్యడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. త్వరగా కోలుకోవాలని సినీ అభిమానులు రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు..