Priyanka Jain: బుల్లితెర ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా పేరు సొంతం చేసుకున్న జంటలలో ప్రియాంక జైన్ (Priyanka jain) , శివ్(Shiv ) జంట కూడా ఒకటి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు పలు రీల్స్, వీడియోలతో అభిమానులలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. గత కొంతకాలంగా లివింగ్ రిలేషన్ లో ఉన్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? అని అభిమానులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ జంట మాత్రం పెళ్లి వైపు అడుగులు వేయడం లేదు. గత కొన్ని నెలలుగా ఆధ్యాత్మిక క్షేత్రాలను చుట్టేస్తూ భక్తిపారవశ్యంలో మునిగి తేలుతున్న ఈ జంట అప్పుడప్పుడు చేసే పనులతో విమర్శలు కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. నీకంటే అంతేకాదు ఫారిన్ కంట్రీస్ కి వెళ్తూ అక్కడ బీచ్ లో ఎంజాయ్ చేస్తూ లైఫ్ని కొనసాగిస్తున్నారు.
అంతేకాదండోయ్ మొన్నా మధ్య ప్రత్యేకంగా సెట్ వేసి మరీ తన బాయ్ ఫ్రెండ్ కి పెళ్లి ప్రపోజల్ పెట్టింది ప్రియాంక. కనీసం ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడగా ఇప్పుడు మరో వీడియోతో అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక తాజాగా శివ్ ,ప్రియాంక ఇద్దరు కలిసి పంచుకున్న వీడియో పై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయంలోకి వెళ్తే.. తాజాగా షేర్ చేసిన వీడియోలో వీరిద్దరూ పెళ్లి తర్వాత నివసించడానికి ప్రత్యేకంగా ఒక డ్రీమ్ హౌస్ ను దగ్గరుండి మరీ నిర్మించుకుంటున్నట్లు చూపించారు. ప్రస్తుతం ఆ హౌస్ కన్స్ట్రక్షన్ లో ఉంది.
ఇక తమ సొంత ఇంటి కోసం ఇప్పుడే కష్టాలు పడుతున్నామంటూ.. ఇసుక మోస్తూ.. నిచ్చెన తీసుకెళ్తూ.. తమ డ్రీమ్ హౌస్ కోసం తామే స్వయంగా కష్టపడుతున్నాం అంటూ చె ప్పుకొచ్చారు. డ్రీమ్ హౌస్ చూసి తర్వాత ఆడియన్స్ పెట్టే కామెంట్లు కూడా ముందే చెబుతూ.. మాకు తెలుసు మీరు ఏమనుకుంటారో.. ముందు పెళ్లి చేసుకోండి అనే కదా అంటూ కూడా తెలిపారు.ప్రస్తుతం ప్రియాంక, శివ్ దగ్గరుండి మరి తమ డ్రీమ్ హౌసును నిర్మించుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
ALSO READ:Siddhu Jonnalagadda: ఒక్క మాట.. సిద్ధుపై సోషల్ మీడియాలో పెరుగుతున్న నెగిటివ్!
అంతేకాదండో ఈ ఇంటి కోసం ఏకంగా కోటి రూపాయలు లోన్ తీసుకున్నట్లు కూడా ప్రకటించడంతో ఇప్పుడు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మ్యూచువల్ గా కోటి రూపాయల లోన్ తో పెళ్లికి ముందే ఈ ఇంటిని నిర్మించుకుంటున్నారు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే పెళ్లి కాకుండానే ఇల్లు కూడా కట్టేస్తున్న ఈ జంట.. కనీసం ఇప్పటికైనా పెళ్లి తేదీని ప్రకటించాలని అభిమానులు కోరుతున్నారు. మరి ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాలి. ఇక ప్రియాంక విషయానికి వస్తే.. మౌనరాగం సీరియల్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. జానకి కలగనలేదు సీరియల్ తో మంచి విజయాన్ని అందుకొని.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టి టాప్ ఫైవ్ లో నిలిచిన లేడీ కంటెస్టెంట్ గా రికార్డ్ సృష్టించింది.
?utm_source=ig_web_copy_link