BigTV English

Diwali 2025: దీపావళి స్పెషల్ స్వీట్స్.. తక్కువ సమయంలోనే రెడీ చేయండిలా !

Diwali 2025: దీపావళి స్పెషల్ స్వీట్స్.. తక్కువ సమయంలోనే రెడీ చేయండిలా !
Advertisement

Diwali 2025: దీపావళి పండగ అనగానే దీపకాంతులు, కొత్త బట్టలు, సందడితో పాటు నోరూరించే పిండివంటలు, ముఖ్యంగా రకరకాల స్వీట్లు గుర్తుకొస్తాయి. అయితే.. పండగ పనుల హడావిడిలో గంటల తరబడి వంటగదిలో గడపడం కొందరికి కష్టంగా ఉంటుంది. అలాంటి వారి కోసం.. 30 నిమిషాల లోపు సులభంగా, త్వరగా తయారు చేసుకోగలిగే కొన్ని రుచికరమైన దీపావళి స్వీట్ రెసిపీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. వీటితో ఈ ఏడాది మీ పండగ వేడుకలను మరింత స్పెషల్‌గా జరుపుకోండి.


1. ఇన్‌స్టంట్ కోకోనట్ లడ్డూ:
కావాల్సినవి:
తురిమిన ఎండు కొబ్బరి- 2 చిన్న కప్పులు
కండెన్స్‌డ్ మిల్క్- తగినంత
నెయ్యి- కొద్దిగా
యాలకుల పొడి- 1/2 టీ స్పూన్
తయారీ విధానం: ఒక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి తురిమిన కొబ్బరిని కాస్త వేయించండి. కొబ్బరి తురుము రంగు మారకుండా చూసుకోండి. అందులోనే కండెన్స్డ్ మిల్క్, యాలకులు పొడి వేసి.. మిశ్రమం ప్యాన్ నుంచి విడిపోయే వరకు తక్కువ మంటపై కలపండి. మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత చిన్న చిన్న లడ్డూలుగా చేయండి. తర్వాత తురుమిన కొబ్బరితో గార్రిష్ చేయండి. అంతే సింపుల్ .. టేస్టీ టేస్టీ కొబ్బరి లడ్డూ రెడీ.

2. మిల్క్ పౌడర్‌తో పేడా:
కావాల్సినవి:
మిల్క్ పౌడర్- 1 కప్పు
కండెన్స్‌డ్ మిల్క్- 1 కప్పు
నెయ్యి- తగినంత
యాలకుల పొడి- 1/2 టీ స్పూన్
తయారీ విధానం: నాన్‌స్టిక్ పాన్‌లో నెయ్యి వేడి చేసి.. కండెన్స్‌డ్ మిల్క్, మిల్క్ పౌడర్, యాలకుల పొడి వేసి బాగా కలపండి. మిశ్రమం గట్టిపడి.. ముద్దగా అయ్యే వరకు మీడియం మంటపై ఉడికించండి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లార్చి, చిన్న చిన్న భాగాలుగా తీసుకుని స్వీట్ పేడ ఆకారంలో ఒత్తి, నట్స్ (బాదం లేదా పిస్తా) తో గార్నిష్ చేయండి.


3. ఇన్‌స్టంట్ బేసన్ బర్ఫీ:
కావాల్సినవి:
శనగపిండి (బేసన్)- 1కప్పు
నెయ్యి- తగినంత
పంచదార పొడి- రుచికి సరిపడా
పాలు/కండెన్స్‌డ్ మిల్క్-కొద్దిగా
,యాలకుల పొడి- 1/2 స్పూన్
తయారీ విధానం: ఒక పాన్‌లో నెయ్యి వేడి చేసి, శనగపిండిని సువాసన వచ్చే వరకు (లేత గోధుమ రంగులోకి మారే వరకు) బాగా వేయించండి. వేయించిన శనగపిండిని మంటపై నుంచి తీసి.. కొద్దిగా చల్లార్చండి. అందులో పంచదార పొడి, యాలకుల పొడి, కొద్దిగా పాలు లేదా కండెన్స్‌డ్ మిల్క్ వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ట్రేలో వేసి సమానంగా పరచి, 10-15 నిమిషాలు చల్లారనివ్వండి. తర్వాత మీకు నచ్చిన ఆకారంలో కోసి, పిస్తా ముక్కలతో గార్నిష్ చేయండి.

Also Read: ముఖంపై నల్ల మచ్చలా ? ఇలా చేస్తే.. బెస్ట్ రిజల్ట్స్

4. రవ్వ కేసరి/హల్వా:
కావాల్సినవి:
బొంబాయి రవ్వ (సూజీ)- 1 కప్పు
నెయ్యి- 3 స్పూన్లు
పంచదార- తగినంత
పాలు లేదా నీళ్లు- సరిపడా
కుంకుమపువ్వు- కాస్త
,జీడిపప్పు, కిస్‌మిస్- గుప్పెడు

తయారీ విధానం: ఒక పాన్‌లో నెయ్యి వేడి చేసి.. జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేయించి పక్కన పెట్టండి. అదే నెయ్యిలో రవ్వను వేసి వేయించండి. వేరే పాత్రలో పాలు లేదా నీళ్లు మరిగించి, అందులో కుంకుమ పువ్వు వేయండి. వేయించిన రవ్వలో ఈ పాలు/నీళ్లు పోసి, గడ్డలు కట్టకుండా కలపండి. రవ్వ ఉడికిన తర్వాత పంచదార వేసి.. మిశ్రమం దగ్గర పడే వరకు ఉడికించండి. తర్వాత వేయించిన నట్స్‌తో అలంకరించి సర్వ్ చేయండి.

Related News

Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ తగ్గించే.. బెస్ట్ ఫుడ్స్ ఏంటో తెలుసా ?

Heart Trouble: మీ గుండె ప్రమాదంలో ఉందా? తెలుసుకోండిలా !

Tree Pod Burial: మరణం తర్వాత మీరు చెట్టుగా మారిపోవచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

Guava Leaf Tea: జామ ఆకుల టీ తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలన్నీ దూరం అవుతాయ్ !

Walking Or Workout: వాకింగ్ లేదా వర్కౌట్.. బరువు తగ్గడానికి ఏది బెటర్ ?

Fatty Liver: డైలీ మార్నింగ్ ఇలా చేస్తే.. ఫ్యాటీ లివర్ సమస్య దూరం

Eyesight: ఈ 4 వ్యాధులు కంటికి హాని కలిగిస్తాయ్ ! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

Big Stories

×