RFCL Recruitment: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్. బీఈ, బీటెక్(కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, డిప్లొమా, సీఏ, సీఎంఏ,, ఎంబీఏ, సివిల్), ఎంబీబీఎస్, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించిన వారికి అయితే ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ జాబ్స్ కి దరఖాస్తు చేసుకోండి.
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(RFCL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రోఫెషనల్స్ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
NOTE: దరఖాస్తుకు ఇంకా ఒక్క రోజే గడువు ఉంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 40
రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పలు విభాగాల్లో ఈ వెకెన్సీలు ఉన్నాయి. కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇనుస్ట్రుమెంటేషన్, మెటీరియల్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సివిల్, మెడికల్, సేఫ్టీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
ఇంజినీర్: 14
సీనియర్ మేనేజర్: 04
చీఫ్ మేనేజర్: 07
డిప్యూటీ జనరల్ మేనేజర్: 03
మేనేజర్: 02
డిప్యూటీ మేనేజర్: 01
అసిస్టెంట్ మేనేజర్: 03
మేడికల్ ఆఫీసర్: 01
సీనియర్ మెడికల్ ఆఫీసర్: 01
డిప్యూటీ సీనియర్ మెడికల్ ఆఫీసర్: 01
అడిషనల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్: 01
సీనియర్ మెడికల్ ఆఫీసర్: 01
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 10
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ (కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, డిప్లొమా, సీఏ, సీఎంఏ,, ఎంబీఏ, సివిల్), ఎంబీబీఎస్, బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎక్స్ పీరియన్స్ ఉంటే బెటర్.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. ఇంజినీర్‌కు 30 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ సీనియర్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్‌కు 40 ఏళ్లు, అడిషనల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, మేనేజర్, సీనియర్ మేనేజర్‌కు 45 ఏళ్లు, చీఫ్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు 50 ఏళ్లు నిండి ఉండాలి. నిబంధన ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ కి ఎంపిక చేస్తారు.
వేతనం: పోస్ట్ కోడ్ ను బట్టి వేతనం ఉంటుంది. భారీ వేతనాలు ఉంటాయి. నెలకు పోస్ట్ కోడ్ ఈ-1కు రూ.40,000 – రూ.1,40,000, ఈ-2కు రూ.50,000 – రూ.1,60,000, ఈ-3కు రూ.60,000 – రూ.1,80,000, ఈ-4కు రూ.70,000 – రూ.2,00,000, ఈ-5కు రూ.80,000 – రూ.2,20,000, ఈ-6కు రూ. 90,000 – రూ.2,40,000, ఈ-7కు రూ.1,00,000 – రూ.2,60,000 జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://rfcl.co.in/careers2.php
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 10
మొత్తం పోస్టుల సంఖ్య: 40
ALSO READ: NPCIL Recruitment: ఎన్‌పీసీఐఎల్‌లో భారీగా ఉద్యోగాలు.. ఇంటర్వ్యూతో జాబ్.. జీతమైతే రూ.74,000