Telangana Bandh: తెలంగాణ రాష్ట్రంలో బీసీ హక్కుల సాధన కోసం వివిధ బీసీ సంఘాలు నడుం బిగించాయి. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించాలనే లక్ష్యంతో ఈ పోరాటాన్ని ఉధృతం చేశారు. రేపటి రాష్ట్ర బంద్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఈ ఉద్యమానికి అనూహ్య బలం చేకూరింది. రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, బీజేపీతో పాటు మావోయిస్టు పార్టీలు, సీపీఐ నుంచి కూడా మద్దతు లభించింది. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ శక్తులు బీసీల రిజర్వేషన్ల డిమాండ్‌కు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ పరిణామం బీసీ సంఘాల పోరాట బలాన్ని, రిజర్వేషన్ల అంశం యొక్క ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.
రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, వామపక్షాలు, ఉద్యమ సంఘాలు మద్దతు తెలపడంతో రేపు బంద్ ప్రభావం సంపూర్ణంగా ఉండే అవకాశముందని తెలుస్తోంది. బంద్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడే అవకాశం ఉంది. ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా ఈ బంద్‌లో పాల్గొనడం లేదా బంద్‌కు మద్దతుగా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా రవాణా సేవలు, వాణిజ్య సంస్థలు కూడా ఈ బంద్‌లో నిలిచిపోయే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన బంద్.. తెలంగాణ సామాజిక-రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలవనుంది. ప్రధాన పార్టీలన్నీ మద్దతు ప్రకటించడం ద్వారా, బీసీల న్యాయం కోసం జరుగుతున్న ఈ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో అర్థమవుతోంది.
Also Read: ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం.. క్లాస్ రూమ్‌లో ఉరివేసుకుని స్టూడెంట్ సూసైడ్
బీసీ రిజర్వేషన్లకోసం అక్టోబర్18న జరిగే తెలంగాణ బంద్ విజయవంతం చేయాలన్నారు బీసీ జేఏసీ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య. బంద్ కేవలం ఏఒక్కరికోసమో కాదు.. బీసీలందరి కోసం.. బీసీలందరూ పాల్గొనాలి.. ఈ బంద్ దారి తప్పొద్దు.. ఒక్క ఎమర్జెన్ఈ సిరీస్ తప్ప అన్ని విభాగాలు బంద్ లో పాల్గొంటాయని చెప్పారు. బీసీ సంఘాల బంద్‌కు కాంగ్రెస్ మద్దతు తెలిపింది. బంద్‌కు మద్దతు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి కట్టుబడి ఉందన్నారు.
బీసీలంటే భయపడే స్థాయికి తెస్తాం: ఆర్. కృష్ణయ్య
బీసీలకు కోర్టులు అన్యాయం చేశాయి
ఈ నెల 18న బంద్ ను పెద్ద ఎత్తున నిర్వహిస్తాం
బంద్ లో అందరూ పాల్గొనాలి
ఒక్క మెడికల్ షాపులు తప్ప అన్నీ మూసేయాలి
ఆర్టీసీ బస్సులు తిరగొద్దు
ప్రజలు ఆవేశంగా ఉన్నారు.. బస్సులు తిరిగితే తగులపెట్టే… pic.twitter.com/4Dw3jWDMT3
— BIG TV Breaking News (@bigtvtelugu) October 16, 2025