Transgenders Suicide Attempt: 24 మంది హిజ్రాలకు ఏమైంది? ఎందుకు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు? ఆసుపత్రిలో వారి పరిస్థితి ఎలా ఉంది? గ్రూపుల మధ్య తగాదాలే ఈ ఘటనకు కారణమా? పోలీసులు ఏం చెబుతున్నారు? ఈ ఘటనకు సంబంధించిన ఎవరైనా అరెస్టు అయ్యారా? అసలు ఇండోర్ సిటీలో ఏం జరిగింది.. జరుగుతోంది?
హిజ్రాల మధ్య ఆధిపత్య పోరు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, భోపాల్ సిటీల్లో హిజ్రాల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఆయా ప్రాంతాల మీదుగా ఏ రైలు వెళ్లినా ఎక్కువగా వారు కనిపిస్తారు. ప్రయాణికుల నుంచి డబ్బులు కూడా అలాగే వసూలు చేస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ప్రాంతాలు వారికి కేరాఫ్‌గా కొందరు చెబుతుంటారు.
బుధవారం రాత్రి ఇండోర్ సిటీలో ఊహించని దారుణం జరిగింది. 24 మంది ట్రాన్స్ జెండర్లు ఫినాయిల్ తాగిన ఘటన కలకలం రేగింది. బుధవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో దీనిపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే వారిని అంబులెన్సుల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఫినైల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన 24 మంది హిజ్రాలు
ప్రస్తుతం మహారాజా యశ్వంతరావ్ హాస్పిటల్ లో కోలుకుంటున్నారు. ప్రాణాపాయం తప్పిందని, ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడించారు. ఫ్లోర్ క్లీనింగ్ మెటీరియల్ తాగి సామూహిక ఆత్మహత్యకు ప్రయత్నించి నట్టు తెలుస్తోంది. వారి ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత బాధితుల నుంచి స్టేట్‌మెంట్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
ట్రాన్స్‌జెండర్లు నివసించే నందలాల్‌పురా ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉండగా పంధారినాథ్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటన తర్వాత కేసు నమోదు అయ్యింది. స్థానిక ట్రాన్స్‌జెండర్ గ్రూప్ నాయకురాలు అరెస్టు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ALSO READ: ఈశాన్య రుతుపవనాలు ఎంట్రీ.. ఓ వైపు వాయుగుండం, ఇంకోవైపు అల్పపీడనం
ఓ ట్రాన్స్‌జెండర్ వర్గానికి చెందిన సభ్యులు కమ్యూనిటీ సమావేశం కోసం సేకరించిన నిధులు తిరిగి ఇవ్వడానికి నిరాకరించారట. ఈ క్రమంలో వారిపై దాడి చేసి చంపేస్తామని బెదిరించారని తెలుస్తోంది. సప్నా హాజీ, ఆమె సహచరుల వేధింపులతో విసిగిపోయిన మరొక గ్రూప్ సభ్యులు దాదాపు 24 మంది బుధవారం రాత్రి నందలాల్‌పురాలోని ఓ శిబిరంలో ఫినైల్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డినట్టు తెలుస్తోంది.
ఇండోర్ సిటీలో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీలోని రెండు గ్రూపులు ఆధిపత్యం పోరు సాగుతోంది. ఆర్థిక లావాదేవీలు, తమ నాయకుడు స్థానంపై చాలా కాలంగా వివాదాలు ఉన్నాయని తెలుస్తోంది. రెండు గ్రూపులు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటున్నారు. చివరకు వీరి వ్యవహారం పోలీసుల వరకు వెళ్లింది. అంతలో ఓ గ్రూప్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. మరి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.