Telangana Cabinet: ఈ రోజు నిర్వహించిన తెలంగాణ కేబినెట్ భేటీ మూడు గంటలు సుదీర్ఘంగా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ కేబినెట్ భేటీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లల సంతానం నిబంధనను ప్రభుత్వం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలున్న సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేయవచ్చు.
⦿ ఇక ముగ్గురు పిల్లలున్నా అర్హులే..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లల సంతానం ఉంటే.. పోటికి అనర్హలు అనే నిబంధనల తెలిగించి చట్టాన్ని మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లులు ఉన్న వారకు కూడా పోటీ చేయవచ్చు. రేవంత్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో ముగ్గురు పిల్లలు ఉన్న వారు కూడా సర్పంచ్ ఎన్నికలకు మేం సై అంటే సై అంటున్నారు.
⦿ మేం పోటీకి రెడీ.. చలో చూసుకుందాం..
రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల నుండి విశేష స్పందన పొందుతోంది. దీనితో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో మేం పోటికి రెడీ అంటూ ముగ్గురు పిల్లలున్న ఆశావహులు కూడా ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ మార్పు తెలంగాణ స్థానిక రాజకీయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది. మరింత మంది నాయకులు ప్రజా సేవలో పాల్గొనేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది నిజంగా ప్రజాస్వామ్య వికేంద్రీకరణ దిశగా తీసుకున్న గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు.
ALSO READ: Telangana Cabinet: 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం.. రెండు రోజుల్లో..?