Chittoor: చిత్తూరు జిల్లా పలమనేరులో విషాదం చోటుచేసుకుంది. కళ్యాణరేవు జలపాతం వద్దకు యూనిస్ అనే యువకుడు తమ స్నేహితులతో కలిసి జలపాతం వద్దకు వచ్చాడు. జలపాతంలో స్నానం చేస్తుండగా.. నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో యూనిస్ అందులో కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు గాలించినప్పటికీ ఆచూకి లభ్యం కాకపోవడంతో అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు గాలింపులు చేపట్టారు. చీకటి పడినప్పటికీ యువకుడి జాడ కనిపించకపోవడంతో అధికారులు వెనుతిరిగారు.