BigTV English

Delhi Liquor Scam: కవిత సేఫ్? ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ పీచేముడ్!

Delhi Liquor Scam: కవిత సేఫ్? ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ పీచేముడ్!
kavitha

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత సేఫ్ అయ్యారా అంటే అవును అనే సమాధానం వినిపిస్తోంది. సీబీఐ రెండో ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుంది ప్రత్యేకకోర్టు. గతానికి భిన్నంగా సీబీఐ తాజా చార్జ్‌షీట్‌లో ఎక్కడా కవిత పేరు కనపించలేదు. కవితను ప్రశ్నించినా.. ప్రశ్నించిన వారి జాబితాలో కవిత పేరును చేర్చలేదు సీబీఐ.


ఏప్రిల్ 25న అనుబంధ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది సీబీఐ. సుమారు 5,700 పేజీలతో రెండో ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. మొదటి ఛార్జ్‌షీట్‌ను నవంబర్ 25న దాఖలు చేసిన సీబీఐ..ఆ తర్వాత డిసెంబర్ 11న కవితను హైదరాబాద్‌లో ప్రశ్నించారు. ఇప్పటి వరకు ప్రశ్నించిన 89 మంది వివరాలను ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించారు సీబీఐ అధికారులు. అందులో కవిత పేరు లేకపోవడం ఆసక్తికరం.

ఏదో జరుగుతోంది? కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య డీల్ కుదిరిందా? అదిగో అరెస్ట్, ఇదిగో అరెస్ట్.. అంటూ ప్రచారం జరిగినా.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పాత్రపై సీబీఐ, ఈడీలు పక్కా ఆధారాలు సేకరించినా.. అరెస్ట్ విషయంలో మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నాయి? సౌత్ గ్రూప్‌ను లీడ్ చేసిందే కవిత అన్నారు. వంద కోట్ల ముడుపులు కవిత ద్వారానే చేతులు మారాయని చెప్పారు. ఆ సౌత్ గ్రూప్‌లోని మాంగుట రాఘవ తదితరులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కవిత అరెస్ట్ విషయంలో మాత్రం సీబీఐ, ఈడీ దూకుడుకు సడెన్ బ్రేకులు పడటం ఆసక్తికరం.


ఇటీవల ఢిల్లీలో ఈడీ వరుసగా రెండు రోజుల పాటు కవితను సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఆమెకు చెందిన 10 సెల్ ఫోన్లు సీజ్ చేసి.. పరిశీలించింది. పక్కా ఎవిడెన్స్ ఉన్నాయంటూ లీకులొచ్చాయి. పక్కా అరెస్ట్ అంటూ ప్రచారం జరిగింది. కట్ చేస్తే, ఏమైందో ఏమోగానీ.. కవిత ఎంచక్కా హైదరాబాద్ తిరిగొచ్చేశారు. అప్పటినుంచీ బీఆర్ఎస్-బీజేపీల మధ్య రహస్య అవగాహన కుదిరిందని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. బీజేపీ నిజాయితీని నిరూపించుకోవాలంటే.. కవితను అరెస్ట్ చేసి చూపించాలంటూ హస్తం నేతలు పదే పదే సవాళ్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ నమోదు చేసిన రెండో ఛార్జిషీట్‌లో కవిత పేరే లేకపోవడం మరింత ఆసక్తికరం.. అంతకు మించి సంచలనం.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×