E-Paper
Advertisement

Telangana Municipal Elections-2026: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-జనసేన దోస్త్.. అలర్టయిన బీఆర్ఎస్, కేడర్‌తో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్

Telangana Municipal Elections-2026: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-జనసేన దోస్త్..  అలర్టయిన బీఆర్ఎస్, కేడర్‌తో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్
Advertisement

Telangana Municipal Elections-2026: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఒక్కసారిగా వేడెక్కాయా? జూబ్లీహిల్స్ బైపోల్ మాదిరిగా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-జనసేనలు కలిసి ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యాయా? ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని బీజేపీ డిసైడ్ అయ్యిందా? బీజేపీ-జనసేన కేడర్ ఫుల్ జోష్‌లో ఉందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ-జనసేన దోస్త్

Advertisement

వచ్చే ఎన్నికల నాటికి బలమైన పార్టీగా తయారు కావాలని తెలంగాణ బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఒంటరిగా తెలంగాణలో విజయం సాధించడం కష్టమని భావించింది ఆ పార్టీ. చివరకు టీడీపీ కంటే జనసేన సాయం తీసుకుంటే మున్సిపల్ ఎన్నికల్లో గట్టెక్కవచ్చని ఆలోచన చేస్తోంది. అన్నట్లుగానే అడుగులు వేసింది.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన మరుసటి రోజు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. ఏపీ కంటే ఎక్కువగా తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఆ తర్వాత నామినేషన్లు ఎవరికివారు దాఖలు చేశారు.

Advertisement

బీఆర్ఎస్ అలర్ట్.. కేడర్‌తో కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్

మంగళవారం నామినేషన్లు ఉపసంహరణ అంకం కూడా ముగిసింది. బీజేపీ పెద్దల సంకేతాలతో మంగళవారం రాత్రి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ చీఫ్ రాంచందర్‌రావు భేటీ అయ్యారు. ముగ్గురు నేతల మధ్య మున్సిపల్ ఎన్నికల గురించి చర్చ జరిగింది. బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పవన్ కళ్యాణ్. చివరకు బీజేపీ తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.

ఇది నాణెనికి ఒకసైడ్ మాత్రమే. రెండోవైపు వద్దాం.. బీజేపీ ఒంటరిగా పోటీ తమకు తిరుగులేదని బీఆర్ఎస్ భావించింది. తెలంగాణ బీజేపీ నేతలు.. పవన్ తో భేటీ అయిన విషయం తెలియగానే బీఆర్ఎస్ అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేకేటీఆర్ రంగంలోకి దిగారు. మున్సిపల్ ఎన్నికల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో ఆయన టెలికాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం చేశారు.

ALSO READ: నిమ్స్ వైద్యుడికి కీలక బాధ్యత.. సీఎం కాన్వాయ్ డాక్టర్‌గా నరేష్ బాబు ఎంపిక!

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించాలన్నారు. అందుకు ఎలాంటి వ్యూహాలు అవలంభించాలో నేతలకు వివరించారు. కేవలం అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ వైఫల్యాలను ఎత్తి చూపాలని సూచన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి అనుకూల వాతావరణం ఉందని,ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని వివరించారు.

అలాగే నామినేషన్లు ఉపసంహరించుకున్న రెబల్ అభ్యర్థులను పార్టీలోకి ఆహ్వానించాలని నేతలకు సూచించారు కేటీఆర్. త్యాగం చేసిన ప్రతి నాయకుడి ఇంటికీ అభ్యర్థులు స్వయంగా వెళ్లాలన్నారు. అంతేకాదు వారిని ప్రచారంలో భాగస్వాముల్ని చేయాలన్నారు. తగిన గౌరవం ఇచ్చి అంతా ముందుకు సాగాల్సిన బాధ్యత సమన్వయకర్తలపై ఉందన్నారు.

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×