BigTV English

Jhonny Master : మళ్లీ జైలుకే… చంచల్ గూడకి డ్సాన్స్ మాస్టారు

Jhonny Master : మళ్లీ జైలుకే… చంచల్ గూడకి డ్సాన్స్ మాస్టారు

హైదరాబాద్, స్వేచ్ఛ : తెలుగు సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొటున్న జానీ మాస్టర్‌ 4 రోజుల పోలీస్ కస్టడీ శనివారానికి ముగిసింది. దీంతో ఆయన్ను నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపర్చారు.


చంచల్ గూడ జైలుకు…

ఈ నేపథ్యంలోనే పోలీసులు మరోసారి కస్టడీ కోరకపోవడంతో ఆయకు జ్యూడిషియల్ రిమాండ్‌ను కొనసాగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.


విచారణలో కళ్లు చెదిరే నిజాలు…

ఓ ప్రముఖ డ్యాన్స్‌ షోలో పాల్గొనేందుకు 2017లో హైదరాబాద్ వచ్చిన బాధితురాలిని పరిచయం చేసుకున్న జానీమాస్టర్, దురుద్దేశంతోనే అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా తీసుకున్నారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు.
2019 డిసెంబరు 15 నుంచి జానీ మాస్టర్‌ వద్దే పనిచేస్తూ అల్కాపురి కాలనీలో ఉంటోందని, ఆ సమయంలో వారిద్దరూ ఓ సూపర్‌హిట్‌ సినిమాకు సైతం పనిచేశారని పేర్కొన్నారు.

ఇక ఆ మూవీ షూటింగ్‌లో భాగంగా 2020 జనవరి 10న జానీ మాస్టర్‌, బాధితురాలు, మరో ఇద్దరు సహాయకులు ముంబయికి వెళ్లారని ఆ రిపోర్టులో వివరించారు. ఆ రోజు అర్థరాత్రి బాధితురాలిని ఆధార్‌కార్డు, ఇతర డాక్యుమెంట్లు తీసుకొని తన గదికి రావాలని ఆదేశించిన జానీ మాస్టర్, ఆమె రాగానే అత్యాచారం చేశాడని పోలీసులు వివరించారు.  అప్పటికి ఆమె వయసు 16 ఏళ్లు కావటంతో పోక్సో కేసు నమోదు చేశారు. తాజాగా జరిగిన పోలీసు విచారణలో జానీ మాస్టర్ ఏం చెప్పారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Also Read : వాళ్లు పేదవాళ్లు ఎలా అవుతారు? టైమ్ చూసి వాటి సంగతి తేలుస్తాం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

మా ఆయన బంగారమే..

ఈ కేసులో నా భర్తను అన్యాయంగా ఇరికించారని, నిజానికి ఈ కేసులో తన భర్తే బాధితుడని జానీ మాస్టర్ భార్య సుమలత అన్నారు. అసలు దోషి ఆ యువతేనంటూ తాజాగా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఫిర్యాదు చేశారు.
‘డ్యాన్సర్‌గా అవకాశం కోసం ఆ యువతే, నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధించింది. పెళ్లి చేసుకోమని నా భర్తపై ఒత్తిడి తీసుకొచ్చింది. ఆయనను ఇంటికి రాకుండా అడ్డుకునేది. కేవలం 2, 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేదని, ఐదేళ్లుగా ఆ అమ్మాయి నాకు నరకం చూపిస్తూనే వచ్చిందని బోరుమన్నారు. ఒక దశలో ఆమె దెబ్బకి నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్నట్లు చెప్పుకున్నారు.

ఒకసారి నేరుగా ఆ యువతితో ఇదే సంగతి అడిగి, ఒకవేళ మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటే నేను ఆయన జీవితం నుంచి తప్పుకుంటా’ అని కూడా చెప్పానని సుమలత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ, ఆమె మాత్రం ‘అలాంటిదేమీ లేదు… మీరిద్దరూ నాకు అన్నావదినలు. అనవసర అనుమానాలు పెట్టుకోవద్దని చెప్పిందని సుమలత వాపోయింది.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×