E-Paper
Advertisement

గద్వాల్లో మెరిసిన ఆణిముత్యాలు.. రెండేళ్ల రికార్డును బ్రేక్ చేసిన ఇంటర్ విద్యార్ధులు

గద్వాల్లో మెరిసిన ఆణిముత్యాలు.. రెండేళ్ల రికార్డును బ్రేక్ చేసిన ఇంటర్ విద్యార్ధులు
Advertisement

Gadwal News: స్వేచ్ఛ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లా విద్యార్థులు ఆదివారం వెలువడిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో ప్రతిభ చాటినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ 2025-2026 విద్యాసంవత్సరానికి గాను జిల్లాలో మొదటి సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు 3,482 మంది పరీక్షలు రాయగా 2161 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 62.06 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో మన జిల్లా 18వ స్థానంలో నిలిచినట్లు చెప్పారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు మొత్తం 884 మంది పరీక్షలు రాయగా 612 మంది ఉత్తీర్ణత సాధించి 69.23%తో రాష్ట్రంలో నాలుగవ స్థానంలో నిలిచామన్నారు.

రాష్ట్రంలో 13వ స్థానం..

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో జిల్లాలో మొత్తం జనరల్ విద్యార్థులు 2994 మంది పరీక్షలు రాయగా, 2186 మంది ఉత్తీర్ణత సాధించి 73.01%తో రాష్ట్రంలో మన జిల్లా 14వ స్థానంలో నిలిచిందన్నారు. ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 706 మంది పరీక్షలు రాయగా 532 మంది ఉత్తీర్ణత సాధించి 75.04%తో మన జిల్లా రాష్ట్రంలో 13వ స్థానంలో నిలవడం జరిగిందన్నారు.

Advertisement

Also read: సొంత పార్టీ నేతలపై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీలొకి భారీ వలసలంటూ..!

ఇదే స్ఫూర్తితో..

గత రెండేళ్లతో పోలిస్తే ఈ విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలు రావడంతో ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు, డిఐఈఓ హృదయ రాజ్, ఇంటర్ విద్య యంత్రాంగానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో జిల్లా ఇంటర్మీడియట్ అధికారులు, అధ్యాపకులు వచ్చే ఏడాది కూడా మంచి ఫలితాలు వచ్చేలా తమ కళాశాలలలో విద్యార్థులకు బోధన చేయాలన్నారు. ప్రణాళికతో ముందుకెళితే 2026-2027 విద్యా సంవత్సరంలో ఇంటర్ ఫలితాల్లో మన జోగులాంబ గద్వాల జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపవచ్చన్నారు. ఆ దిశగా ఇప్పటి నుంచే కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఇంటర్మీడియట్ అధికారులకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు.

Advertisement

Also Read: ఇక పెట్రోల్ బైక్స్ కనిపించకూడదట.. ఢిల్లీ సర్కారు షాకింగ్ డెసిషన్!

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×