E-Paper
Advertisement

Telangana Local Body Elections: కాంగ్రెస్ జోరు.. మరింత హుషారుగా స్థానిక పోరుకు తయారు

Telangana Local Body Elections: కాంగ్రెస్ జోరు.. మరింత హుషారుగా స్థానిక పోరుకు తయారు
Advertisement

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం ఇచ్చిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు మరింత సమర్థంగా సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫలితం తేడా కొడితే కాంగ్రెస్ టికెట్ కోరే అభ్యర్థులు డీలాపడేవారేమో కానీ, ఈ విజయం కాంగ్రెస్ కి రెట్టింపు ఉత్సాహాన్నిచ్చిందనే చెప్పాలి. స్థానిక పోరులో కూడా ఇదే జోరు కొనసాగే అవకాశముంది.

స్థానిక పోరు ఎప్పుడు?
వాస్తవానికి ఈపాటికే తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అనే అంశం దగ్గర వ్యవహారం పెండింగ్ పడింది. రిజర్వేషన్లపై ఈనెల 24లోగా స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 17వతేదీన జరిగే కేబినెట్ భేటీలో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్లొచ్చని కోర్టు చెబుతూ హైకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఈ గడువు డిసెంబర్ 3తో ముగుస్తుంది. ఈలోగా తెలంగాణలో బీసీ సంఘాలు ఆందోళనలకు సిద్ధపడ్డాయి. రాజ్యాంగ సవరణతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆ పని జరగాలంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చొరవ చూపాల్సి ఉంటుంది.

Advertisement

కాంగ్రెస్ లో హుషారు..
వాస్తవానికి స్థానిక ఎన్నికలను ఎదుర్కోడానికి కాంగ్రెస్ ముందు నుంచీ హుషారుగానే ఉంది. మొత్తం 31 జిల్లాలు, 565 మండలాల్లో స్థానిక పోరు జరగాల్సి ఉంది. 5,749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో సహజంగా స్థానిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీదే పైచేయి అవుతుంది. దానికి తోడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రకటనతో కాంగ్రెస్ కి మరింత మైలేజీ పెరిగింది. రిజర్వేషన్ నిర్ణయం అమలవుతుందా, కోర్టు అనుమతిస్తుందా, చివరకు రాజ్యాంగ సవరణ జరుగుతుందా లేదా అనే విషయాన్ని పక్కనపెడితే బీసీలకు మేలు చేయాలనేది కాంగ్రెస్ ఉద్దేశంగా జనాలకు స్పష్టమైపోయింది. అయితే ఇప్పుడీ పాజిటివ్ నెస్ కి తోడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఆ పార్టీకి మరింత బలాన్నిచ్చిందని చెప్పాలి.

పోల్ మేనేజ్ మెంట్ లో భేష్..
కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్ మెంట్ లో ఈ దఫా మంచి ఫామ్ లో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు పార్టీ విజయానికి గట్టిగా పనిచేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం దీన్ని మరోసారి రుజువు చేసింది. అంటే ఎన్నిక ఏదయినా కాంగ్రెస్ విజయం కోసం పార్టీ కార్యకర్తలు గరిష్ట స్థాయిలో కష్టపడుతున్నారనేది వాస్తవం. అందులోనూ ప్రజల తీర్పు పార్టీకి అనుగుణంగా ఉండటంతో పార్టీ అభ్యర్థులు మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా భావిస్తే.. రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారనేది సుస్పష్టం. అయితే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేదే తేలాల్సి ఉంది.

Advertisement

Also Read: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ప్రభంజనం.. నవీన్ యాదవ్ భారీ విజయం

Also Read: బీహార్‌ ఎన్నికల్లో దూసుకెళ్తున్న ఎన్డీయే కూటమి..

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×