E-Paper
Advertisement

Jupalli joined Congress: కాంగ్రెస్ లోకి జూపల్లి.. ఖర్గే సమక్షంలో చేరిక..

Jupalli joined Congress: కాంగ్రెస్ లోకి జూపల్లి.. ఖర్గే సమక్షంలో చేరిక..
Advertisement
Jupally Krishna rao joins Congress

Jupally Krishna rao joins Congress(Political news today telangana) :

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్ రెడ్డి హస్తంగూటికి చేరారు. వారికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాలని జూపల్లి కృష్ణారావు తొలుత భావించారు. అయితే భారీ వర్షాల కారణంగా ఆ కార్యక్రమం నిర్వహించలేకపోయారు. తెలంగాణలో వర్షాల వల్ల జూలై 20, 30న రెండుసార్లు ప్రియాంక పర్యటన వాయిదా పడింది. ఒకవైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. దీంతో జూపల్లి ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

Advertisement

లోక్ సభ సమావేశాలు జరుగుతున్న క్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేత మల్లు రవి ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణలో కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో కాంగ్రెస్ శ్రేణులలో జోష్ కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని ఇస్తున్నాయి.

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×