BigTV English

Kaleshwaram Project Investigation: పైసలు.. ప్రశ్నలు.. కాళేశ్వరం కమిషన్ దూకుడు..!

Kaleshwaram Project Investigation: పైసలు.. ప్రశ్నలు.. కాళేశ్వరం కమిషన్ దూకుడు..!

– కాళేశ్వరంపై కొనసాగుతున్న విచారణ
– ఘోష్ కమిషన్ ముందుకు పది మంది ఐఏఎస్‌లు, మాజీలు
– ప్రాజెక్టు నిర్మాణాలు, నిర్ణయాలు, విధానాలపై ప్రశ్నలు
– వారం రోజుల్లో అఫిడవిట్ సమర్పించాలని ఆదేశాలు


Justice Chandra Ghose Commission Speed Up Investigation on Kaleshwaram Project: కాళేశ్వరంపై సమగ్ర విచారణ జరుపుతోంది జస్టిస్ చంద్రఘోష్ కమిషన్. ఈ క్రమంలోనే పది మంది ఐఏఎస్‌లు, మాజీలను విచారించింది. ప్రస్తు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు విచారణకు హాజరు కాగా, వివరాలను అఫిడవిట్ రూపంలో వారం రోజుల్లో ఇవ్వాలని ఆదేశించింది కమిషన్. అయితే, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో తనకు సమయం కావాలని ఆయన కోరారు. దానికి అంగీకరించిన కమిషన్, ఆగస్టు 5 లోపు సమర్పించాలని స్పష్టం చేసింది.

బీఆర్కే భవన్‌లో జరిగిన ఈ విచారణకు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన రజత్ కుమార్, వికాస్ రాజ్, స్మితా సబర్వాల్, జోషి, కంచర్ల రఘు హాజరయ్యారు. అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. నిర్మాణ లోపాలపై పలు ప్రశ్నలు సంధించింది. విచారణకు సంబంధించి విద్యుత్ ఉద్యోగి కంచెర్ల రఘు మాట్లాడుతూ, మూడు అంశాలు కమిషన్ ముందు చెప్పడం జరిగిందని అన్నారు. తుమ్ముడి హెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం, మూడు బ్యారేజీల నిర్మాణ అంశాలు, పంపు హౌజ్‌ల నిర్మాణాలపై మాట్లాడినట్టు చెప్పారు.


‘‘రీ డిజైనింగ్ పేరుతో తుమ్మిడి హెట్టి నుంచి మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం బ్లండర్ తప్పిదమని మేము గుర్తించాం. మేడిగడ్డ దగ్గర నిర్మించినప్పటికీ ఎల్లంపల్లి వరకు ఎలాంటి ఆయకట్టు లేదు. ఈ మూడు అంశాలపై సాక్ష్యాధారాలను కమిషన్‌కు అందించాం. డీపీఆర్ అప్రూవల్ కాకుండానే మూడు బ్యారేజీలు నిర్మించారు. అదికూడా సరైన స్థలంలో నిర్మించలేదు. నిర్మాణంలో అనేక తప్పిదాలు జరిగాయి. కాళేశ్వరంలో టెండర్లు నిబంధనలకు అనుకూలంగా జరగలేదు.

Also Read: గొర్రెల స్కాంలో.. కేటీఆర్ పీఏ..!?

బ్యారేజీల మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల నష్టం జరిగింది. పంపు హౌస్‌ల నిర్మాణంలో కూడా తప్పిదాలు ఉన్నాయి. మునిగిపోవడానికి నిర్మాణ లోపాలే కారణం. సాక్ష్యాదారాలన్నీ జస్టిస్ ఘోష్ కమిషన్‌కు అందించా. ఇచ్చిన ఆధారాలను పరిశీలించిన తరువాత మరొకసారి పిలుస్తామని కమిషన్ చెప్పింది’’ అని వివరించారు రఘు.

Tags

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×