E-Paper
Advertisement

ఆదివాసీల కోసం రంగంలోకి కవిత.. కేంద్రానికి చుక్కలు చూపించే ప్లాన్ సిద్ధం!

ఆదివాసీల కోసం రంగంలోకి కవిత.. కేంద్రానికి చుక్కలు చూపించే ప్లాన్ సిద్ధం!
Advertisement

Adivasi Rights: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర నేతృత్వంలోని ఆదివాసీ జేఏసీ బృందం భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బంజారాహిల్స్ లోని జాగృతి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆల్ ఇండియా ఆదివాసీ కానిస్ట్యూషనల్ రైట్స్ అండ్ కల్చరల్ ప్రొటెక్షన్ జేఏసీ నాయకులు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆదివాసీలు ఎదుర్కొంటున్న సవాళ్లను కవిత దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్ల ద్వారా లభించే రక్షణలను తొలగించే ప్రయత్నం చేస్తోందని, పెసా చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల సుమారు 3 లక్షల మంది ఆదివాసీలు తమ ఆవాసాలను కోల్పోతున్నారని, వారికి సరైన పునరావాసం కల్పించడంలో కేంద్రం విఫలమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అడవి నుంచి దూరం చేయడమే కాకుండా, వారికి అడవిలో లభించే కనీస సౌకర్యాలను కూడా అందకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Advertisement

ఆదివాసీల అస్తిత్వం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. దేశవ్యాప్తంగా చేపట్టిన జనగణనలో మతం కాలమ్‌లో ‘ఆదివాసీ’ అనే ప్రత్యేక కేటగిరీని చేర్చకపోవడం దేశ మూలవాసుల సంస్కృతిని అవమానించడమేనని అన్నారు. జనగణనలో ఆదివాసీల కోసం ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలని, అలాగే వారి ప్రాచీన భాష ‘కోయతూర్’ను రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.

దేశంలోని 12 కోట్ల మంది ఆదివాసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు జేఏసీ చేస్తున్న పోరాటానికి తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ఇస్తుందని కవిత ప్రకటించారు. భవిష్యత్తులో తాము ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీ ఆదివాసీల హక్కుల పరిరక్షణకు, వారి సంస్కృతిని కాపాడటానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పాడూరి శ్రీనివాస్, పాయం సత్యనారాయణ సహా పలువురు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: మత్స్యకారుల ఆశీస్సులు జగన్‌కే.. 2029 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ ఖాయం!

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×