E-Paper
Advertisement

ఉద్యోగులకు కల్వకుంట్ల కవిత బహిరంగ క్షమాపణ.. న్యాయం చేయలేకపోయామంటూ పశ్చాత్తాపం

ఉద్యోగులకు కల్వకుంట్ల కవిత బహిరంగ క్షమాపణ.. న్యాయం చేయలేకపోయామంటూ పశ్చాత్తాపం
Advertisement

హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చేపట్టింది. ఈ ధర్నాకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరై తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తగిన న్యాయం చేయలేకపోయినందుకు ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ధర్నాను ఉద్దేశించి కవిత మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో తాను కూడా భాగస్వామినే అని, ఆనాటి నిర్ణయాల్లోని లోపాల వల్ల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జరిగిన అన్యాయంలో తనకు కూడా భాగం ఉందని భావోద్వేగంగా పేర్కొన్నారు. మీ జీవితాల్లో మార్పు తీసుకురాలేకపోయినందుకు మీ చెల్లిగా మీ అందరినీ క్షమించమని కోరుతున్నాని అన్నారు. గతంలో తాము కొన్ని విభాగాల్లో మార్పులు చేసే ప్రయత్నం చేసినప్పటికీ, పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయామని ఆమె నిజాయితీగా అంగీకరించారు.

Advertisement

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వంపై ఒక్క రూపాయి భారం పడకుండా సమస్యను పరిష్కరించే అవకాశం ఉన్నప్పటికీ, 900కు పైగా ఉన్న ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని ఆమె ఆరోపించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం వెంటనే ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి రెండు రోజులు సమయం ఇస్తున్నాం. ఈలోపు ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగ భద్రతపై జీవోలు రావాలి. లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామ‌ని హెచ్చరించారు. ఐదు లక్షల మంది ఉద్యోగులు హైదరాబాద్ వీధుల్లో హాఫ్ మిలియన్ మార్చ్ నిర్వహిస్తే ప్రభుత్వం దిగిరాక తప్పదని ఆమె పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో చురుగ్గా ఉన్న కోదండరాం, హరగోపాల్ వంటి మేధావుల మౌనాన్ని కవిత తప్పుబట్టారు. వారి మౌనం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శాపంగా మారిందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతున్నా వారు ప్రశ్నించకపోవడం సరికాదని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధర్నా చౌక్‌ను కేవలం పేరుకే ఉంచి, ప్రజల ఆవేదనను పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. ముఖ్యంగా ఆడబిడ్డలకు కనీసం ప్రసూతి సెలవులు కూడా ఇవ్వకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తెలంగాణ జాగృతి త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరించబోతోందని కవిత ఈ వేదికపై ప్రకటించారు. తమ పార్టీ విధానం ప్రకారం ప్రభుత్వంలో అసలు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వ్యవస్థలే ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ ఫలాలు నేరుగా ప్రజలకు అందాలంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ మాత్రమే ఉండాలని తమ పాలసీగా పేర్కొన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు జాగృతి ఉద్యోగుల వెంటే ఉంటుందని, ఖమ్మం వెలుగుమట్ల బాధితుల విషయంలో చూపించిన మొండితనమే ఇక్కడ కూడా ప్రదర్శిస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Read Also: Jeevan Reddy: కాక రేపుతున్న జగిత్యాల రాజకీయం.. 45 ఏళ్ల బంధానికి విద్వంసమే జీవన్ రెడ్డి అజెండానా..?

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×