Kalvakuntla Kavitha: నేటి నుంచి తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ పండుగ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో.. కేసీఆర్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. చింతమడకలో కవిత బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నారు.
తాజాగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. సిద్దిపేట జిల్లా చింతమడకు చేరుకున్నారు. ఆమెకు స్థానిక మహిళలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ‘సీఎం.. సీఎం..’ అంటూ భారీ ఎత్తున నినాదాలు చేశారు.
బతుకమ్మ వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు
సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలో పాల్గొననున్నారు కవిత. ఇప్పటికే చింతమడకలోని శివాలయం, రామాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. స్థానికులు, మహిళలు, బతుకమ్మ సంస్కృతిని గౌరవిస్తూ, కవితను ఆధ్యాత్మికంగా స్వాగతించారు. ఈ వేడుకలో ఆమె ఉత్సాహపూర్వకంగా పాల్గొనడం, ప్రజలతో దగ్గరగా ఉండటం, బతుకమ్మ సాంప్రదాయానికి ప్రాధాన్యత ఇవ్వడం విశేషంగా నిలిచింది.
రాజకీయ పరిణామాలు
కవిత ఇటీవలే భారత రాష్ట్ర సమితి (BRS)కు రాజీనామా చేశారు. BRS ద్వారా వచ్చిన ఎంఎల్సీ పదవిని కూడా వదులుకున్నారు. ఇలా తన కుటుంబ పార్టీకి దూరమై, స్వతంత్రంగా, కొత్త దిశలో అడుగులు వేస్తున్న కవిత చర్యలు, తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
రాజీనామా తర్వాత ఆమె ఏ స్టెప్ తీసుకుంటారో అన్న విషయంపై ప్రజల్లో, మీడియా వర్గాల్లో ఊహాగానాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజాప్రతినిధిగా, మహిళా నాయకురాలిగా కవిత దృష్టి ప్రజల సాధారణ సమస్యలపై ఉంది. ఈ నేపథ్యంలో ఆమె చింతమడకకు వచ్చిన ఆహ్వానం, స్వయంగా వేడుకల్లో పాల్గొనడం, ప్రాధాన్యాన్ని మరింత పెంచింది.
స్థానిక స్వాగతం
ఈ సందర్భంగా కేసీఆర్ (KCR) ఇలాఖా అయిన చింతమడక నుండి ఆహ్వానం రావడం, కవిత స్వయంగా పాల్గొనడం హాట్ టాపిక్‌గా మారింది. స్థానికులు, జాగృతి నేతలు, ఘనంగా స్వాగతం పలికారు.
Also Read: 10 నకిలీ గోల్డ్ లోన్ అకౌంట్స్.. రూ.75 లక్షలు.. బయటపడ్డ యూనియన్ బ్యాంకు మేనేజర్ బాగోతం
కవిత భావోద్వోగం
ఈ ఆహ్వానంపై కవిత భావోద్వోగంతో స్పందించారు. గొప్ప ఉద్యమకారుని కన్నా గొప్ప ఊరు మా చింతమడక. నా చిన్ననాటి జ్ఞాపకాలు చాలా గుర్తుకు వస్తున్నాయి. ఈ కష్టకాలంలో మీరంతా నాకు ధైర్యమిచ్చారని అన్నారు. అయితే ఇది కేవలం పండుగ ఆహ్వానంగా రాజకీయ విశ్లేషకులు చూడడం లేదు. ఇది కవిత పక్కా ప్రణాళికతో వేస్తున్న ఒక రాజకీయ ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు. ఈ పరిణామంతో కవిత కొత్త పార్టీ ఖాయమని.. ఆ పార్టీ ప్రస్తానం తన తండ్రి సొంత గ్రామం నుండే మొదలు కానుందని ఊహాగానాలు బలపడుతున్నాయి. ఇప్పుడు కవిత రాజకీయ పునఃప్రారంభానికి బీఆర్ఎస్‌లో కొత్త యుద్ధానికి వేదిక రాబోతుందా.. అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.