రైల్వే ప్రయాణాల్లో ప్యాసింజర్లు సేఫ్ గా ఉండాలని భారతీయ రైల్వే కీలక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా మహిళా ప్రయాణీకులు సేఫ్ గా జర్నీ చేసేలా ఏర్పాట్లు చేస్తుంది. మహిళలకు ప్రత్యేక కంపార్ట్ మెంట్లు, సీసీటీవీ నిఘా, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో పాటు హెల్ప్ లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. అంతేకాదు, ప్రయాణ సమయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఓవైపు మహిళల పట్ల రైల్వే అధికారులు కీలక చర్యలు చేపడుతుంటే, కొంత మంది రైల్వే ఉద్యోగులు మహిళా ప్రయాణీకులో వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఓ టీసీ చేసిన పనికి మహిళా ప్రయాణీకురాలు షాక్ అయ్యింది. తనకు జరిగిన ఘటన గురించి రెడ్డిట్ వేదికగా వివరించింది. ఈ ఘటనపై నెటిజన్లు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సదరు టీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రీసెంట్ గా ఓ మహిళ రైలు ప్రయాణం చేసింది. ఈ సందర్భంగా టీసీ తనతో వ్యవహరించిన తీరు భయం కలిగించిందని వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తనకు ఎదురైన అనుభవాన్ని వివరించింది. “నేను ఇటీవల రైలులో ప్రయాణిస్తున్నాను. కాసేపటికి నా కోచ్ లోకి టీసీ వచ్చాడు. నా టికెట్ చెక్ చేశాడు. కాసేపటికి అతడు నాకు ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో రిక్వెస్ట్ పంపినట్లు గమనించాను. అతడు రిజర్వేషన్ చార్ట్ నుండి నా పేరు, ఇతర వివరాలు తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. నిజాయితీగా చెప్పాలంటే, ప్రయాణీకులు ప్రయాణం కోసం ఇచ్చే ప్రైవేట్ సమాచారాన్ని ఇలా ఉపయోగించడం అనేది కాస్త భయానకంగా అనిపించింది. ఇది చాలా సాధారణమేనా? అని ఆలోచిస్తున్నారా? ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురయ్యిందా?” అని రెడ్డిట్ లో రాసుకొచ్చింది.
TC checked my ticket and then my Instagram LOL 👀
byu/Active-Parking2365 inindianrailways
Read Also: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!
ఈ పోస్టు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు కారణం అయ్యింది. చాలా మంది వినియోగదారులు ఆమెను ఈ విషయం గురించి రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. “నిజంగా ఇలాంటి ఘటనలు అసాధారణం. ఆమోదయోగ్యం కాదు కూడా” అని నెటిజన్లు కామెంట్ చేశారు. మరో నెటిజన్ కూడా తనకు ఇలాంటి ఘటన ఓసారి ఎదురయినట్లు వెల్లడించింది. “నిజమే ఒకసారి ఒక TC నా టికెట్ చెక్ చేశాక, అతడు తిరిగి వచ్చి నన్ను తనతో ఫాలో అవ్వమని అడిగాడు. నేను కాస్త ఆందోళన పడ్డాను. నా నంబర్ కూడా తీసుకోవాలని ప్రయత్నించాడు. కానీ, నేను అతడికి ఇవ్వలేదు. సోషల్ మీడియాలో ఫాలో కూడా చేయలేదు” అని వివరించింది. “రైల్వే కోచ్ ఎంట్రీ దగ్గర ప్రయాణీకుల జాబితాలను తొలగించడానికి ఇదే కారణం” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఘటనపై నెట్టింట తెగ చర్చ జరుగుతోంది.
Read Also: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?