Hyderabad City: ఖైరతాబాద్ సీటుకు బైపోల్ ఖాయమా? ఉప ఎన్నిక కోసం పార్టీలు అప్పుడే నిమగ్నమయ్యాయా? ఎందుకంటే హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తుందా? మళ్లీ పరిశీలించాలని నిర్ణయం స్పీకర్ చేతులో పెడుతుందా? ఒకవేళ బైపోల్ అనివార్యమైతే దానం పరిస్థితి ఏంటి? మళ్లీ పోటీ చేస్తారా? లేకుంటే డ్రాపవుతారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. బైపోల్ దాదాపు ఖాయమైంది. ఇదే సమయం లో దానం, సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడా హైకోర్టు సీన్ రిపీట్ అయితే నెక్ట్స్ ఏంటి? ఉప ఎన్నికల బరిలోకి ఆయన దిగుతున్నారా? ఆయన ప్లేస్‌లోకి మరొక వ్యక్తి రంగంలోకి దిగుతారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి దానం సూచించిన కొత్త ఫార్ములా ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.
సుప్రీంకోర్టులో వేటు పడితే ఎమ్మెల్యే సీటుకు బదులుగా తెర మీదకు దానం కొత్త ఫార్ములా తెచ్చినట్టు గాంధీభవన్ వర్గాల మాట. దానం కొత్త ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఉప ఎన్నిక వస్తే.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, తనకు మంత్రి పదవి ఇవ్వాలని దానం విజ్ఞప్తి చేసినట్టు చర్చ మొదలైంది. ఎమ్మెల్యే పదవికి బదులుగా ఎమ్మెల్సీ ఇచ్చి తనకు మంత్రి పదవిపై ఇవ్వాలని కొత్త ఫార్ములా తీసుకొచ్చారట.
దానం ప్రతిపాదనపై కాంగ్రెస్ వర్గాల్లో నేతలు హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే పోటీకి దూరంగా ఉంటానని, పార్టీ గెలుపు కోసం పని చేసేలా వ్యూహం చేశారట దానం. ఒకవేళ ఆయన ప్రపోజల్స్ కు కాంగ్రెస్ పెద్దలు ఆసక్తి చూపితే, టికెట్ రేసులో విజయారెడ్డి, రోహిన్ రెడ్డి పోటీ పడే అవకాశముంది. మరి ఎమ్మెల్సీ సీటు ఎక్కడ? నవంబర్‌లో ఖాళీ అయ్యే గవర్నర్ కోటా ఎమ్మెల్సీపై దానం కన్నుపడిందని చెబుతున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలకు ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం.
ALSO READ: ఇవన్నీ మీ తాత ముత్తాతల ఆస్తులా కేటీఆర్? అజీజ్ నగర్‌లో చామల రచ్చ!
ఖైరతాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టినా దగ్గర ఉండి గెలిపిస్తానని పార్టీ పెద్దల వద్ద ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్ మదిలో ఏముందో? వెయిట్ అండ్ సీ? ఒకవేళ ప్రతిపక్ష పార్టీలు బీజేపీ-బీఆర్ఎస్ ఏకమైతే అప్పుడు పరిస్థితి ఏంటన్నది మరోవైపు వినిపిస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఈ సీటు గెలుపు.. జీహెచ్ఎంసీ ఎన్నికలపై పడుతుందని లెక్కలు వేస్తున్నారు. తేడా వస్తే పార్టీకి ఇబ్బందులు తప్పవన్నది ఇంకొందరు అంటున్నారు. మొత్తానికి ఖైరతాబాద్ బైపోల్ గెలుపు కోసం అధికార-విపక్షాలు అప్పుడే కసరత్తు మొదలుపెట్టేశాయి.