E-Paper
Advertisement

బిగ్ బాస్ 10.. ఈ వారం కృష్ణుడు ఎలిమినేట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ 10.. ఈ వారం కృష్ణుడు ఎలిమినేట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?
Advertisement

Bigg Boss 10: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 లో సెప్టెంబర్ 6వ తేదీన చాలా ఘనంగా ప్రారంభమైంది. 10 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి అడుగుపెట్టగా.. 6 మంది కామనర్స్ అగ్నిపరీక్ష సీజన్ 2లో తమ సత్తా చాటి హౌస్ లోకి వచ్చారు. ఎవరూ ఊహించని విధంగా ఈ దశావతారం కాన్సెప్ట్ లో మొదటి వారమే చైత్ర రాయ్ , చరణ్ హౌస్ నుంచి మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ఎలిమినేట్ అయ్యారు. అయితే చరణ్ ను మళ్లీ ఆడియన్స్ రిక్వెస్ట్ మేరకు హౌస్ లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

హౌస్ నుండి కృష్ణుడు ఎలిమినేట్?

ఇకపోతే రెండవ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే ఉత్కంఠ అందరిలో నెలకొనగా.. చైత్రను ఎలిమినేట్ చేసినట్టుగానే ఇప్పుడు కృష్ణుడిని కూడా ఎలిమినేట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈసారి కృష్ణుడు(Krishnudu ) ఎలిమినేట్ కాబోతున్నట్లు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చైత్ర తర్వాత కృష్ణుడే బయటకు వెళ్తాడు అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం . నిన్నటి ఎపిసోడ్లో బిగ్ బాస్ కృష్ణుడు, సృష్టిల ఆట తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు బిగ్ బాస్. గత వీకెండ్ లో వారు ఎలా ఆడారో ప్రేక్షకుల్లా కూర్చొని చూడాలని చెబుతూ ఇద్దరినీ స్టోర్ రూమ్ లో కూర్చోబెట్టాడు. దీంతో పాటు ప్రేక్షకులు సైతం కృష్ణుడిని అన్ సేఫ్ లో ఉంచారు. కృష్ణుడు ఆట తీరుపై బిగ్ బాస్ కూడా ఫోకస్ పెట్టాడని చర్చ మొదలయ్యింది.

పాండా తో పోల్చిన దెబ్జానే..

Advertisement

అంతేకాదు కృష్ణుడి ఆట కూడా పెద్దగా హౌస్ లో హైలెట్ కావడం లేదని అభిప్రాయాలను కూడా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో దేబ్జానీ కృష్ణుడిని పాండాతో పోలుస్తూ చేసిన కామెంట్లు కూడా వైరల్ గా మారాయి. ఆ మాటను ఆధారంగా చేసుకొని నెటిజన్స్ మీమ్ వీడియోలు కూడా రూపొందిస్తున్నారు. మరి కొంత మంది వెటకారంగా వినాయకుడి నిమర్జనానికి వేళయింది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

చైత్ర తర్వాత కృష్ణుడే..

ఇకపోతే గతంలో చైత్ర విషయంలో కూడా ఇలాంటి చర్చే మొదలైంది. అందుకే ఆమె ఎలిమినేట్ అయింది. ఇప్పుడు కృష్ణుడు విషయంలో కూడా ఇలాగే ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇక ఈయన ఎలిమినేషన్ కూడా తప్పదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ చర్చ నిజమైన ఎలిమినేషన్ ఫలితమా? లేక ప్రేక్షకుల అంచనా మాత్రమేనా ? అనేది తెలియాలి అంటే నేటి ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే. మొత్తానికి అయితే ఈ వారం కృష్ణుడు ఎలిమినేషన్ అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

also read: మహాభారతం ‘భీముడు’ పై కేస్ ఫైల్.. అసలేం జరిగిందంటే?

ఎలిమినేట్ అయితే కృష్ణుడికి లభించేది ఎంత?

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 10 లోకి కృష్ణుడు సెలబ్రిటీ కాబట్టి వారానికి ఏకంగా రూ.2లక్షల నుండి రూ.3 లక్షల రెమ్యూనరేషన్ ఒప్పందంతో హౌస్ లోకి అడుగు పెట్టాడు. ఇకపోతే నేడు ఎలిమినేట్ కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రెండో వారాలకు గాను సుమారుగా రూ.4నుండి రూ.6లక్షల రెమ్యూనరేషన్ తీసుకొని కృష్ణుడు బయటకు వెళ్ళబోతున్నట్టు సమాచారం.

Related News

ఆ ఇద్దరూ మరీ అంత వరస్ట్? ఇచ్చిపడేసిన నాగ్!

మహాభారతం ‘భీముడు’ పై కేస్ ఫైల్.. అసలేం జరిగిందంటే?

Podarillu Chakri : చక్రికీ బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Podarillu Today Episode : కేశవకు జాగారం.. మాధవ్ కు వార్నింగ్.. నిజం చక్రికీ తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు ప్లాన్.. కిడ్నాపర్స్ ఎంట్రీ.. పల్లవి దొరుకుతుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ విడిపోతారా..? రామరాజు నెక్స్ట్ ఏంటి..? శ్రీవల్లి అవుట్..

Big Stories

Advertisement
×