BigTV English

Karimnagar: అనాథ యువతికి ప్రభుత్వమే పెళ్లి.. అధికారులే ఆత్మబంధువులు

Karimnagar: అనాథ యువతికి ప్రభుత్వమే పెళ్లి.. అధికారులే ఆత్మబంధువులు

Karimnagar: సర్కారు బాలసదన్‌లో ఆశ్రయం పొంది పెళ్లీడుకు వచ్చిన ఓ అనాథ యువతికి.. ప్రభుత్వ అధికారులే దగ్గరుండి కరీంనగర్‌ కళాభారతిలో పెళ్లి జరిపించారు. అమ్మనాన్నల బాధ్యత తీసుకుని పుస్తెలు, మెట్టెలు సహా అనేక కానుకలు అందించారు. కలెక్టర్ పమేలా సత్పతి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.ఇతర ప్రభుత్వ అధికారులు హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. భవిష్యత్తులో ఈ దంపతులకు సర్కారే అండగా ఉంటుందని.. తల్లిదండ్రుల పాత్రను తామే తీసుకుంటామన్నారు అధికారులు.


పూజ అలియాస్ మౌనిక.. చిన్నతనంలో ఉండగానే తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. కన్నవారు తప్ప ఎవరూ లేకపోవడంతో పూజతోపాటు, ఆమె ముగ్గురు చెల్లెళ్లలను ప్రభుత్వం చేరదీసింది. బాలసదన్ లో ఆశ్రయం కల్పించి వారికి చదువు చెప్పించింది. వీరిలో పూజ ఇంటర్మీడియట్ వరకు చదువుకుని కంప్యూటర్ శిక్షణ తీసుకుని ఓ ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. పెళ్లీడుకొచ్చిన పూజకు పెళ్లి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో తనకు నచ్చిన సాయితేజతో పెళ్లి జరిపించాలని అధికారులను కోరింది పూజ.

మంథని పట్టణానికి చెందిన సాయితేజ కుటుంబం గురించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు పూర్తి వివరాలు సేకరించారు. సాయితేజ కుటుంబీకులు ఒప్పుకోవడంతో ప్రభుత్వ అధికారుల సమక్షంలో కరీంగనర్ కళాభారతిలో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.


ఈ వివాహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మహిళా సంక్షేమ అధికారి సబిత, ఇతర అధికార యంత్రాంగమంతా హాజరయ్యారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి నవదంపతలును ఆశీర్వదించారు. పెళ్లి కూతురుకు అమ్మానాన్ని లేరనే లోట తెలియకుండా భాజా భజంత్రీల నడుమ, కమ్మని విందు బోజనాలు ఏర్పాటు చేసి పెళ్లి తంతు నిర్వహించారు. తాలిబొట్టు, మెట్టెలు, ఇంట్లోకి కావాల్సిన పట్టుపరుపులు, మంచం, ఇతర గృహపకరణాలన్నీ అధికారులు తలో చేయి వేసి అందించారు. కొందరు దాతలు కూడా ముందుకు వచ్చి పూజ వివాహానికి ఆర్థిక సహాయం అందించారు. టీఎన్జీవోలు, గెజిటెడ్ అధికారులు కూడా తమ వంతు సాయం అందించారు.

తల్లిదండ్రులను కోల్పోయి ముగ్గురు చెల్లెళ్లతో సహా ప్రభుత్వ ఆశ్రమంలో చేరిన ఓ యువతి పెళ్లీడుకు రావడంతో.. ప్రభుత్వమే పెళ్లి చేస్తోందని చెప్పారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ప్రభుత్వం తరఫు ఏ సాయం కావాలన్నా అందిస్తామని.. వారు జీవితంలో స్థిరపడేందుకు సర్కారు అండగా ఉంటుందని చెప్పారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.

Also Read: పార్టీల చూపంతా నల్గొండపై.. నలుగురికి ఎమ్మెల్సీ సీట్లు, అదెల సాధ్యం 

తమ వివాహానికి సహకరించిన ప్రభుత్వ యంత్రాంగానికి వధువు మౌనిక, వరుడు సాయితేజ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో తామిద్దరం చాలా ఆనందంగా ఉంటామని చెప్పారు. ఇరువురం ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని.. తనకు తన తల్లిదండ్రులు సహకరించారన్నారు సాయితేజ.

సర్కారు చేసిన ఈ పెళ్లి శుభప్రదం కావాలని.. నవదంపతులు భవిష్యత్తులో ఆదర్శ జంటగా మారాలని ఆశిద్దాం..

Tags

Related News

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

TG Number Plates: ఇకపై ఆ వాహనాలపై ‘తెలంగాణ పోలీస్’ స్టిక్కర్లు.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు

Union Bank Manager Fraud: 10 నకిలీ గోల్డ్ లోన్ అకౌంట్స్.. రూ.75 లక్షలు.. బయటపడ్డ యూనియన్ బ్యాంకు మేనేజర్ బాగోతం

Hyderabad News: అడ్డంగా దొరికిపోయిన కేఏ పాల్‌.. పోలీసుల చేతుల్లో ఆయన గుట్టు

Hyderabad: ఘనంగా సెలబ్రిటీ డాండియా నైట్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Big Stories

×