Anushka Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025) నేపథ్యంలో… ఫైనల్స్ లో గెలిచిన టీమిండియా చాంపియన్ గా నిలిచింది. న్యూజిలాండ్ జట్టు పైన… ఫైనల్ మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా…. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ట్రోఫీని ఎగరేసుకు వెళ్ళింది. దీంతో టీమ్ ఇండియా.. ప్రపంచంలోనే తిరుగులేని జట్టుగా నిలిచింది. అయితే చాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ గెలిచిన తర్వాత టీమ్ ఇండియా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అటు గ్రౌండ్ లో టీమిండియా క్రికెటర్లు కూడా సందడి చేశారు.
Also Read: IND VS NZ: ఛాంపియన్స్ ట్రోఫీ సంబరాలు…హైదరాబాద్ ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీఛార్జ్!
డాన్సులు చేస్తూ… రచ్చ రచ్చ చేశారు. అయితే… విరాట్ కోహ్లీ భారీ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) భార్య రితికా సజ్దేహ్ ( Ritika Sajdeh) ఇద్దరు కూడా గ్రౌండ్ లో… ఈ సంబరాలలో పాల్గొన్నారు. మిగతా టీమిండియా క్రికెటర్లు కూడా తమ కుటుంబాలతో ఎంజాయ్ చేశారు. అయితే ఈ తరుణంలోనే… ఈ సంబరాలలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను హగ్ చేసుకుంది విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ. టీమిండియా గెలిచిన నేపథ్యంలో…. రోహిత్ శర్మకు కంగ్రాట్స్ చెబుతూ… గట్టి హగ్ ఇచ్చింది అనుష్క శర్మ ( Anushka Sharma ). పక్కనే రితికా సజ్దేహ్ ఉన్నప్పటికీ… ఏ మాత్రం తగ్గలేదు అనుష్క శర్మ. నేరుగా వెళ్లి టైట్ హగ్ ఇచ్చింది.
అయితే బాలీవుడ్ హీరోయిన్ గా అనుష్క శర్మ కొనసాగినప్పటి నుంచి… ఆమెకు ఈ కల్చర్ అలవాటు అయ్యింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కచ్చితంగా హీరోలకు…. హీరోయిన్లు హగ్ అందిస్తుంటారు. ప్రస్తుతం రోహిత్ శర్మ విషయంలో కూడా అదే జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… విరాట్ కోహ్లీ ఎదురుపడ్డప్పుడు రితికా సజ్దేహ్ ఎక్కడ ఇవ్వలేదు. కంగ్రాట్స్ మాత్రమే చెప్పింది. కానీ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) భార్య అనుష్క శర్మ మాత్రం ఓవర్ గా రియాక్ట్ అయి…. రోహిత్ శర్మకు హాగ్ ఇవ్వడం జరిగింది. ఈ తరుణంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అనుష్క శర్మ ఇచ్చిన హగ్గు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన ఫ్యాన్స్ రక రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.
ఇక అంతకు ముందు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ( Champions Trophy 2025) ఫైనల్ లో టీమిండియా గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ.. నేరుగా వెళ్లి అనుష్క శర్మను హగ్ చేసుకున్నాడు. తన కుటుంబంతో కాస్త జాలిగా గడిపాడు. కాగా.. ఈ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ 70 కి పైగా పరుగులు చేస్తే…కోహ్లీ ఒక్క పరుగు చేశాడు. అయినప్పటికీ… చివరలో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇద్దరూ జట్టును ఆదుకున్నారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ విజేతగా నిలిచింది టీమిండియా.
Also Read: Ind vs nz: కోహ్లీ, రోహిత్ దాండియా….చిన్న పిల్లాడిలా సునీల్ గవాస్కర్ స్టెప్పులు !
Anushka Sharma hugging Rohit Sharma & congratulating him after the Champions Trophy win. ❤️pic.twitter.com/D2qCx2wsY2
— Tanuj Singh (@ImTanujSingh) March 10, 2025