E-Paper
Advertisement

Kaushik Reddy : నాకంటే చిన్నోడు.. నా తమ్ముడున్నాడు.. కేసీఆర్ ను మించిపోయిన కౌశిక్ రెడ్డి..

Kaushik Reddy  : నాకంటే చిన్నోడు.. నా తమ్ముడున్నాడు.. కేసీఆర్ ను మించిపోయిన కౌశిక్ రెడ్డి..
Advertisement
padi koushik reddy

Kaushik Reddy : దేశంలో హామీలివ్వడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని మించినోరు లేరని అంటూ ఉంటారు. ఇప్పుడదే పార్టీలో చాలామంది కేసీఆర్ బాటే పడుతున్నారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వీరందరికన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ, ప్రభుత్వం ఇవ్వకపోతే, తానే రూ. 2 వేల కోట్లు ఇస్తానని సంచలన ప్రకటన చేశారు. దీంతో ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ షాక్ తింది.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంక మండలంలో  కౌశిక్ రెడ్డి ప్రచారంలో అన్నమాట కరెంట్ షాక్ తగిలినట్టు, హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కి తగలింది. అందరూ ఒక్కసారి తుళ్లిపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డి అలవికాని హామీలన్నీ ఇస్తూ ప్రచారంలో కేసీఆర్ నే మించిపోయారని అంటున్నారు.

Advertisement

నాకంటే చిన్నోడు…నా తమ్ముడున్నాడు అన్న పాట చందంగా కేసీఆర్ కంటే చిన్నోడు ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారని అంటూ జనం  సెటైర్లు వేస్తున్నారు. మాకన్నా దద్దమ్మలు ఇంకెవరూ దొరకలేదా? నాయనా అని రివర్స్ లో ఉతికేస్తున్నారు. కేసీఆర్ ఒకహామిస్తే, తాను నాలుగు హామీలిస్తా.. తానేమైనా తక్కువ తిన్నానా? అంటూ కౌశిక్ రెడ్డి ప్రచారంలో గుడ్డిగా వెళ్లిపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే వీణవంక మండలంలో ప్రచారం చేస్తున్న కౌశిక్ రెడ్డి వాహనం ముందుకి.. కొంత మంది రైతులు వెళ్లారు. మాకింకా రుణమాఫీ అందలేదని కంప్లయింట్ చేశారు. దానికి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల తర్వాత పూర్తి రుణమాఫీ చేస్తామని తెలిపారు. అంతవరకు బాగానే ఉంది.

Advertisement

అయితే అప్పటికే కేసీఆర్ ఇచ్చిన హామీలకు ఊరుఊరునా దారిన పోయే ప్రతి ఒక్కరికి బదులు చెప్పలేక.. అలా రుణమాఫీ ఇవ్వలేని పక్షంలో ఆ డబ్బులు తానే చెల్లిస్తానని సంచలన హామీ ఇచ్చారు. అదేమీ రూపాయి రెండు రూపాయిలు కాదండీ బాబూ.. రూ.2 వేల కోట్లు. ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే తానే చెల్లిస్తానని చెప్పడంతో అది కాస్తా… నెట్టింట వైరల్ అయిపోయింది.

ఇప్పుడది పీకలమీదకి వచ్చిందనే అంటున్నారు. ఎన్నికల సంఘం ఆరాతీస్తే పరిస్థితి ఏమిటి ? అంటున్నారు. 2వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారంటే ఏం చెబుతారు…? ఇప్పటికే ఐటీ రైడ్స్ తో అందరికీ తలబొప్పి కడుతోంది. మరిలాంటి సమయంలో కౌశిక్ రెడ్డి దగ్గర రెండు వేల కోట్లు ఎలా వచ్చాయని అడిగితే ఆయనేం సమాధానం చెబుతరాని నెట్టింట వైరల్ అవుతోంది.

విషయం తెలిసిన కాంగ్రెస్ నేతలు, అప్పుడే కౌశిక్ రెడ్డిని ఒక రేంజ్ లో ఆడుకుంటున్నారు. మీ నాయకుడు కేసీఆర్ ని భలే ఫాలో అవుతున్నావులే.. హామీలివ్వడంలో గురువు కేసీఆర్ ని మించిన శిష్యుడిలా ఎదిగిపోయావు. శభాష్ అంటున్నారు. నాకంటే చిన్నోడు నా తమ్ముడున్నాడు అంటే కౌశిక్ రెడ్డి మాత్రమేనని సెటైర్లు పేల్చుతున్నారు.

రుణమాఫీ విషయంలో కేసీఆర్ మాట తప్పరు. మడమ తిప్పరని కౌశిక్ రెడ్డి  చెబుతున్నాడు.  ఇప్పుడు రూ. 2 వేలకోట్ల హామీపై ఎంత కాలం మడమ తిప్పకుండా ఉంటావో మాట తప్పకుండా ఉంటావో మేం కూడా చూస్తామని అప్పుడే స్థానికులు కౌంటర్లు వేస్తున్నారు.

ఎన్నికల హీట్ పెరిగిపోవడంతో ఎవరు ఎలాంటి హామీలిస్తున్నారో అర్థం కాకుండా ఉంది. కేవలం అధికార దాహం కోసం కౌశిక్ రెడ్డి లాంటి వాళ్లు ఇలాంటి అడ్డమైన హామీలిచ్చి నవ్వులపాలు కావద్దని, బీఆర్ఎస్ పార్టీని నగుబాటు చేయవద్దని సీనియర్లు సూచిస్తున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×