E-Paper
Advertisement

kavitha : కొత్త పార్టీతో బరిలోకి కవిత.. ఫస్ట్ టార్గెట్ ఆయనేనా?

kavitha : కొత్త పార్టీతో బరిలోకి కవిత.. ఫస్ట్ టార్గెట్ ఆయనేనా?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త పార్టీ పెట్టనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తొలిసారిగా కొత్త పార్టీని ఎప్పుడు తీసుకొస్తున్నారో ప్రకటించారు. అంతేకాకుండా, వచ్చే జనరల్ ఎలక్షన్‌లో పోటీ చేస్తానని ప్రకటించారు.ఎక్కడ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారో సైతం స్పష్టంచేశారు. కవిత మరోసారి రాజకీయ పార్టీపై ప్రకటన చేయడంతో ప్రస్తుతం పొలిటికల్ డైవర్షన్ రాబోతున్నదని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తన పార్టీపై కాకుండా వేరే పార్టీ గుర్తుతో పోటీ చేసిన ఆమె అనుచరులు.. ఈసారి ఆమె పార్టీ కొత్త గుర్తుపై పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ పేరుతోనే పార్టీ..

కవిత తాను పెట్టబోయే పార్టీలో తప్పకుండా తెలంగాణ అనే పదం ఉంటుందని ఆమె స్పష్టంచేశారు. గతంతో జాగృతినే పార్టీ రూపంలో తీసుకొస్తారని ప్రచారం జరిగింది. మరి ఈసారి జాగృతినే పార్టీగా మారుస్తారా? లేక కొత్తగా పార్టీ పేరును ప్రకటిస్తారా? అనేది తెలియాల్సి ఉన్నది.ఇదే ఏడాది మే నెలలో కవిత కొత్త పార్టీ ఉంటుందని ఆమె ఇవాళ ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని ఆమె ఇంట్లో మీడియాతో మాట్లాడిన కవిత.. ఈ ప్రకటన చేశారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట లేదా బోధన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు. కవిత ప్రకటనతో బీఆర్ఎస్ పార్టీ నేతలు సైతం షాక్ అవుతున్నట్టు తెలుస్తోంది.

ఆయనే పొలిటికల్ టార్గెటా?

కల్వకుంట్ల కవిత రాజకీయంగా ఒకరిని టార్గెట్ చేసినట్టు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఆమె ఈ పరిస్థితుల్లో ఉండటానికి.. బీఆర్ఎస్ పార్టీ, కల్వకుంట్ల ఫ్యామిలీకి ఆమె దూరం కావడానికి సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు కారణమని కవిత భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో నేరుగా సిద్దిపేటలో బరిలోకి దిగాలని ఆమె చూస్తున్నారని చర్చ జరుగుతున్నది.సిద్దిపేటలో ఆయన్ను ఓడించి తన ప్రతీకారం తీర్చుకోవాలని కవిత భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. కేసీఆర్ కూతురిగానే కాకుండా ఉద్యమంలో పాల్గొన్న తనకు తెలంగాణ ప్రజలు అండగా నిలుస్తారని ఆమె బలంగా నమ్ముతున్నారని తెలుస్తోంది.

BRS : ‘దానం’ విషయంలో పెద్ద తప్పుచేసిన బీఆర్ఎస్!

మున్సిపల్ ఎన్నికల్లో జీరో..

కవిత రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్నారని ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్‌లో పెత్తనం ఆశించి ఆమె ఫెయిల్ అయ్యారని.. తండ్రి, సోదరుడు పట్టించుకోకపోవడంతో ఆమె ఫ్రస్టేషన్‌లో పార్టీ పెడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ చాలా మందే పార్టీలు పెట్టారని.. అలాగే వెళ్లిపోయారని.. కవిత పార్టీతో రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా మార్పులు ఏం ఉండవని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే కవితకు బీఆర్ఎస్ పార్టీలో అడిగిన పోస్టు ఇచ్చేదుంటే ఆమె కొత్త పార్టీ పెట్టేదా? తండ్రికి, సోదరుడికి దూరంగా వెళ్లేదా? అని గులాబీ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సింహం పార్టీ గుర్తు మీద ఆమె అనుచరులు పోటీ చేస్తే ఏమైందని.. గెలిచిన వారు సైతం కవిత ప్రమేయం ఇందులో ఏమీ లేదని చెప్పారని గుర్తుచేస్తున్నారు.

 

 

Related News

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

Big Stories

×