E-Paper
Advertisement

బీసీ కుల గణనపై కేంద్రం కుట్ర.. కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం

బీసీ కుల గణనపై కేంద్రం కుట్ర.. కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం
Advertisement

OBC Census: బీసీ కులాల జనాభాను తక్కువగా చూపి.. వారు ఐక్యంగా పోరాడకుండా కేంద్రం రాజకీయ కుట్ర చేస్తోందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. జనగణనలో ఓబీసీ కాలాన్ని కులాల వారీగా చూపకుండా బలహీన వర్గాలను కులాల సముహాలుగా విడగొట్టి ఐక్య పోరాటాలు జరగకుండా ప్రయత్నాలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బంజారాహిల్స్ లోని ఓ హోటల్లో నిర్వహించిన ‘పాలిటిక్స్ బియాండ్ క్యాస్ట్’ సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్రం చేపట్టే కుల గణనలో బీసీ జనాభా విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కేవలం క్యాస్ట్ కాలం పెట్టేసి చేతులు దులుపుకుంటామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.

ప్రతి రాష్ట్రంలో ఉన్న కులాల జాబితాను కచ్చితంగా అప్ లోడ్ చేయాలని, ఉపకులాలను కూడా కలిపి లెక్కించాలని కేంద్రాన్ని కవిత డిమాండ్ చేశారు. లేదంటే బీసీల జనాభా తక్కువగా కనిపించే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ఒకే కులానికి సంబంధించి దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్టేటస్ ఉందని, ఆ సమస్యను పరిష్కరించాలంటే బీసీ ఉపకులాలను కూడా కలిపి లెక్కించటం జరగాలన్నారు. లేదంటే ఉప కులాల్లో ఉండే వారికి న్యాయం జరగదని వారిని కూడా ఒక కులంగా లెక్కల్లో చూపే ముప్పు ఉంటుందన్నారు.

Advertisement

ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ లో ఉన్న 57 ఉపకులాల కారణంగా వారికి న్యాయం జరగటం లేదన్న విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. అయినప్పటికీ వేల కోట్లు ఖర్చు చేస్తూ బీసీ జన గణనలో కూడా సొలుష్యన్ లేకుండా చేయటం సరికాదన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కుల గణన పేరుతో బీసీ జనాభాను తక్కువ చేసి చూపిందని కవిత చెప్పారు. కేంద్రం చేపట్టే కుల గణన ద్వారా ఆ సమస్య తీరుతుందని భావిస్తే.. వాళ్లు సమస్యను మరింత జఠిలం చేస్తున్నారని మండిపడ్డారు. కుల గణనకు సంబంధించి మరో నాలుగు నెలల సమయం ఉందనిఈ లోగా కేంద్రం ఈ సమస్య పరిష్కరించటంపై దృష్టి సారించాలన్నారు.

Also Read: నందిగామ్ బైపోల్లో బిగ్ ట్విస్ట్.. మమత మద్దతు ఇచ్చిన గంటల వ్యవధిలో.. కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్!

Advertisement

కుల వివక్ష అనేది మన డీఎన్ఏ లోనే పాతుకుపోయిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, స్పీకర్ లాంటి వాళ్లు కూడా కుల వివక్ష కు గురికావటం అన్యాయమన్నారు. ఈ జఠిలమైన సమస్యకు మల్టీ డైమన్షన్ సొలుష్యన్స్ అవసరమన్నారు. ఈ సమస్యకు అప్పర్ కాస్ట్, బాధితుడు అనే రెండు కోణాలున్నాయని, బాధితుడి కోణం నుంచి చూసినప్పుడు మాత్రమే సరైన పరిష్కారం లభిస్తుందని చెప్పారు. చట్టాల పరంగా ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడే కుల వివక్ష నిర్మూలన సాధ్యమవుతుందని అన్నారు. పురుషులతో సమానంగా పనిచేసినప్పటికీ మహిళలకు వేతనాల్లో వ్యత్యాసం చూపించటం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతన చట్టాలు ఉన్నప్పటికీ 2026లో కూడా వేతన వ్యత్యాసం చూపుతున్నారన్నారు.

Also Read: ఐఫోన్ డ్యుయో బదులు.. ఇవన్నీ కొనేయొచ్చు.. ఒక్కసారి ఈ లెక్క చూడండి!

Tags

Related News

అటెండర్ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం.. ఇద్దరు కేటుగాళ్ల అరెస్ట్!

కుంభమేళా రేంజ్‌లో గోదావరి పుష్కరాలు.. రేవంత్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!

48 కిలోల పంచలోహాలు, 24 క్యారెట్ల బంగారం పూత? బేగంబజార్ గణనాథుడిపై పోలీసుల క్లారిటీ!

నా భూమిలో చిన్న తప్పున్నా 13 ఎకరాలు రాసిచ్చేస్తా! సీఎం రేవంత్‌కు హరీశ్ రావు సవాల్

వైష్ణవి భర్త హరిబాబు హత్యపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ, సంతోష్ ‘రివేంజ్’ ఏం చెబుతోంది?

హైకోర్టు తీర్పుకు జై.. సుప్రీంకు వెళ్లేది లేదంటున్న దానం నాగేందర్!

సత్యమేవ జయతే.. పార్టీ ఫిరాయించిన మిగతా వారికి ఇదే గతి: కేటీఆర్

Big Stories

Advertisement
×