E-Paper
Advertisement

Kavitha : ప్రగతి భవన్ కు కవిత.. సీబీఐ నోటీసులపై కేసీఆర్ తో చర్చ..

Kavitha : ప్రగతి భవన్ కు కవిత.. సీబీఐ నోటీసులపై కేసీఆర్ తో చర్చ..
Advertisement

Kavitha : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు రావడం తెలంగాణలో రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని ప్రగతి భవన్‌కు కవిత వెళ్లడం మరింత ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ మద్యం కేసులో కవితకు సీబీఐ నోటీసులు రావడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ శుక్రవారం కవితకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలో నమోదు చేసిన ఆర్‌సీ 53(ఎ)/2022 కేసులో దర్యాప్తు కోసం సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద ఢిల్లీకి చెందిన సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్‌ కుమార్‌ షాహి ఈ నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 6న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో కానీ, ఢిల్లీలో కానీ కవిత నివాసంలో విచారిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.

Advertisement

సీబీఐ నోటీసులపై కవిత స్పందించారు. తన వివరణ కోరుతూ సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద సీబీఐ నోటీసులు జారీ చేసిందన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో వివరణ ఇస్తానని సీబీఐ అధికారులకు తెలియజేశానని వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత ప్రగతి భవన్‌కు వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ అంశంపై కవిత ఇప్పటికే న్యాయనిపుణులతో చర్చించారని సమాచారం. అదే విధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును రాజకీయంగా ఎలా ఎదుర్కొవాలన్న దానిపై కేసీఆర్ తో కవిత చర్చించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ కార్యకర్తలకు కవితకు సంఘీభావం తెలుపుతున్నారు. హైదరాబాద్ లోని ఆమె నివాసం వద్దకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×