E-Paper
Advertisement

Talasani Srinivas Yadav: పదేళ్ల పాలనలో దేశం అబ్బురపడే విధంగా అనేక పథకాలు అమలు : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్

Talasani Srinivas Yadav: పదేళ్ల పాలనలో దేశం అబ్బురపడే విధంగా అనేక పథకాలు అమలు : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్
Advertisement

Talasani Srinivas Yadav:  తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు మాజీ మంత్రి, డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, (Talasani Srinivas Yadav) యువ నాయకులు తలసాని సాయి కిరణ్ యాదవ్ ల ఆధ్వర్యంలో  తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, (KTR) డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్ రావు లు అతిథులుగా హాజరయ్యారు. కేసీఆర్ గారి 72 వ జన్మదినాన్ని పురస్కరించుకుని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిప్యూటీ ప్లోర్ లీడర్ లు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో కలిసి 72 కిలోల భారీ కేక్ ను కట్ చేశారు. అనంతరం కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమం నేపథ్యంతో రూపొందించిన పాటలు, డాక్యుమెంటరీ ని ప్రదర్శించారు.

Also Read: Minister Sridhar Babu: హైదరాబాద్ ను ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్ గా తీర్చిదిద్దుతాం : మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి

ఘనత కేసీఆర్‌దే

Advertisement

ఈ సందర్భంగా మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తన ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి గా చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. పదేళ్ల పాలనలో దేశం అబ్బురపడే విధంగా అనేక పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికారంలో ఉన్నామని దౌర్జన్యాలు చేస్తామంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

మూడేళ్ళ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే

గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు గతంలో ఏ ముఖ్యమంత్రి ప్రచారం చేయలేదని, కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించిన, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడిన చెప్పుకోదగ్గ ఫలితాలు కాంగ్రెస్ పార్టీ సాధించలేదని విమర్శించారు. మూడేళ్ళ తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని అన్నారు. మాకు మీరు చాలా నేర్పించారని, మేము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ జన్మదిన వేడుకలలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సుధీర్ రెడ్డి, తెలంగాణ భవన్ ఇంచార్జి రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉద్యమ కారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

Also Read: Daily Commute Cheapest Cars: మారుతి సుజుకి ఆల్టో To రెనాల్ట్ క్విడ్.. రోజువారీ అవసరాలకు బెస్ట్ కార్లు!

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×