BigTV English

KCR Chandi Yagam: ఫామ్ హౌస్‌లో కేసీఆర్ చండీయాగం.. మరి కవిత నిరాహార దీక్ష మాటేంటి?

KCR Chandi Yagam: ఫామ్ హౌస్‌లో కేసీఆర్ చండీయాగం.. మరి కవిత నిరాహార దీక్ష మాటేంటి?

KCR Chandi Yagam: కేసీఆర్ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? అంతర్గత సమస్యలు రెట్టింపు అవుతున్నాయా? చండీయాగం వెనుక అసలు ఉద్దేశం ఏంటి? కవిత నిరాహార దీక్ష సక్సెస్ అవ్వాలని చండీయాగం చేస్తున్నారా? కూతురి దీక్షను డైవర్ట్ చేసేందుకు స్కెచ్ వేశారా? ఇవే ప్రశ్నలు ఆపార్టీలోని చాలామంది నేతలను వెంటాడుతున్నాయి.


శ్రావణమాసం లక్ష్మీనారాయణుల పూజకు అతి పవిత్రమైన మాసం. శ్రావణంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని పురాణాలు బలంగా చెబుతున్నాయి. ఇలాంటి మంచి రోజులను వదిలి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చండీయాగం చేయడం ఎవరి కోసం?

చండీయాగం అనేది దుర్గాదేవిని పూజించే ఒక పవిత్రమైన హోమం అని పండితులు చెబుతున్నారు. శాంతి కోసం గ్రహాలు అనుకూలించడం కోసం, భయాలు తొలగించ డానికి, శత్రువులపై విజయం సాధించడానికి, అలాగే ఇతర శుభకార్యాల కోసం చాలామంది చేస్తుంటారు. ముఖ్యంగా దసరా సమయంలో ఇలాంటి యాగాలు ఎక్కువగా చేస్తారని చెబుతున్నారు.


కొద్దిరోజులుగా అంతర్గత సమస్యలతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఏ ఇష్యూ ఎత్తుకున్నా చివరకు బూమరాంగ్ అవుతోంది. పార్టీ వ్యవహారాలు కావచ్చు.. లేకుంటే ఫ్యామిలీ విషయాలు కావచ్చు. రోజురోజుకూ పెద్దది అవుతూ ఉంటున్నాయి. కానీ సమస్యలకు ఫుల్‌స్టాప్ పడిన సందర్భం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే గ్రహాలు అనుకూలించలేదన్నది పండిత పొలిటీషియన్స్ మాట.

ALSO READ: నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం

సోమవారం నుంచి అంటే ఆగష్టు 4 నుంచి ఆరు వరకు చండీయాగం చేస్తున్నారు కేసీఆర్. 15 మంది ఋత్వికులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. తన సతీమణి శోభతో కలిసి పాల్గొంటున్నారు కేసీఆర్. పార్టీకి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితుల నుంచి విముక్తి పొందేందుకు యాగం నిర్వహిస్తున్నట్లు సమాచారం.

మూడు నెలలుగా అంతర్గత సమస్యలతో కేసీఆర్ టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తోంది. కీలక నేతలతో మాట్లాడుతున్నట్లు ఆయన ఏ మాట బయటకు చెప్పలేదని అంటున్నారు. నేతలు చెప్పిన మాటలను క్షుణ్ణంగా వింటున్నారట. ఏ మాట బయటపెడితే ఎలాంటి సమస్యలు వస్తాయోనని భావించి సైలెంట్ అవుతున్నట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలో చండీయాగం చేపట్టారని అంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లపై కవిత సోమవారం నుంచి 72 గంటలపాటు నిరాహార దీక్షకు దిగుతున్నారు.  అన్ని గంటలపాటు కేసీఆర్ చండీయాగం చేస్తున్నారు. దీనివెనుక అసలు ఉద్దేశం ఏంటన్నది  ప్రత్యర్థులు నుంచి కౌంటర్లు పడిపోతున్నాయి.

కూతురు కవిత నిరాహర దీక్ష సక్సెస్ కావాలని కేసీఆర్ చండీయాగం చేస్తున్నారా? అంతర్గత సమస్యలు తొలగిపోవాలని చేస్తున్నారా? అనే దానిపై ఆ పార్టీ నేతలు చిన్నపాటి చర్చ మొదలుపెట్టేశారు. ప్రస్తుతానికి కేసీఆర్ చండీయాగంపై నేతలు బయటకు నోరు విప్పకపోయినా రకరకాలుగా మాట్లాడుకోవడం మొదలైంది.

 

Related News

Congress: బీసీ రిజర్వేషన్ల కోసం.. హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా

Weather Alert: బీ అలర్ట్..! తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు..

KTR In Delhi: కేటీఆర్ ఢిల్లీ ముచ్చట్లు.. ఆ భేటీ ఉద్దేశమేంటి?

KCR Big Sketch: గువ్వల రిజైన్ వెనుక కేసీఆర్ కొత్త స్కెచ్ ?

Farmers: సొంత భూమి ఉంటే చాలన్నా.. సింపుల్‌గా రూ.50వేలు పొందండిలా..?

Chiranjeevi: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో చిరంజీవి? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేటీఆర్

Big Stories

×